#ప్రియానిక్.. ఒకేచోట‌ టాట్టూల‌తో ఆలుమ‌గ‌లు ఇదేమి సిత్రం?

Update: 2021-02-04 17:30 GMT
ప‌చ్చ‌బొట్టు మ‌న సంస్కృతిలో అత్యంత‌ పురాత‌న‌మైన‌దే అయినా పాశ్చాత్య దేశాల్లో టాట్టూగా ఎక్కువ‌ వైర‌ల్ అయ్యింది. ముంబై ప‌రిశ్ర‌మ స‌హా టాలీవుడ్ లోనూ ఈ సంస్కృతికి విప‌రీత‌మైన  ఫాలోయింగ్ ఉంది. ఇక అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రాకి ప‌చ్చ‌బొట్లు అంటూ విప‌రీత‌మైన ఆస‌క్తి.

ఆస‌క్తిక‌రంగా నిక్ జోనాస్ టాట్టూ అభిరుచి ఎంతో గొప్ప‌ది. ఇక పీసీకి త‌న నిశ్చితార్థం రోజున నిక్ ఓ గ‌మ్మ‌త్తైన ర‌హ‌స్యాన్ని త‌న చెవిలో వేశాడ‌ట‌. అది ఏమంటే త‌న ఒంటిపై ఎన్ని ప‌చ్చ‌బొట్లు ఉన్నాయో.. ఎన్ని గ‌డులు ఉన్నాయో ముందే లెక్క పెట్టేశాడ‌ట‌.

అదే విష‌యాన్ని ఎంతో ముచ్చ‌ట‌పడుతూ చెప్పుకున్న పీసీ త‌న చెవి వెన‌క వైపుగా ఉన్న ప‌చ్చ‌బొట్టును బ‌హిరంగంగా చూపించింది. ఆ గ‌డి లాంటి చ‌తుర‌స్ర‌పు ప‌చ్చ‌బొట్టు అంటే నిక్ కి చాలా ఇష్టం. అందుకే ప్ర‌తిసారీ త‌న‌ని అక్క‌డే ముద్దాడేస్తుంటాడ‌ట‌. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంత‌కుముందు రివీల‌య్యాయి.

ప్రియాంక చోప్రాకు తన భర్త నిక్ జోనాస్ వారి మొదటి ఎంగేజ్ మెంట్ వార్షికోత్సవంలో మ‌నిద్ద‌రికీ ఒకేలా పచ్చబొట్లు ఉన్నాయని అన్నాడ‌ట‌. 20 జూలై 2018న ఈ జంట నిశ్చితార్థం అయ్యింది.

రెండవ నిశ్చితార్థ వార్షికోత్సవం సందర్భంగా ప్రియాంక ఒక అందమైన ఫోటోని షేర్ చేసి హత్తుకునే నోట్ ని రాసింది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రియాంక మెడ అంచున ఉన్న ప‌చ్చ‌బొట్టుపై నిక్ ముద్దు పెట్టేస్తున్న ఫోటో అది.  నా జీవితంలో గొప్ప ఆనందానికి 2 సంవత్సరాల వ‌య‌సు. రెండేళ్ల‌ క్రితం ఈ రోజున మీరు నన్ను వివాహం చేసుకోమని అడిగారు! నేను అప్పుడు మాటలు లేకుండా ఉండవచ్చు .. కానీ నేను ప్రతి రోజూ `ఎస్` అనే చెప్తున్నాను. నాకు అది ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సంద‌ర్భం. నన్ను ఎప్పటికీ గుర్తుకొచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు. నేను ప్రపంచంలోనే అదృష్టవంతురాలైన అమ్మాయిని! నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిక్ జోనాస్`` అంటూ పీసీ ఎమోష‌న‌ల్ నోట ని రాసింది.

పీసీ చెవి వెనుక కనిపించే బాక్స్ టిక్ మార్క్ టాట్టూ ఎంతో ఆక‌ర్షిస్తుండ‌గా.. నిక్ చేతిలో అదే డిజైన్ ఉంది. ప్రియాంక ఒక పత్రిక కోసం కొత్త ఫోటో షూట్ లో తన పచ్చబొట్టు లోగుట్టును ఓపెన్ చేసింది. ప్ర‌ఖ్యాత ఎల్లేతో మాట్లాడుతూ, ``మేము నిశ్చితార్థం చేసుకున్నప్పుడు నిక్ తన ఒంటిపై ఉన్న అన్ని బాక్సులను తనిఖీ చేశానని చెప్పాడు.  నిశ్చితార్థం తొలి వార్షికోత్సవం నాటికి మ్యాచింగ్ టాటూలు వేయించుకున్నాం. నా చెవుల వెన‌క‌.. అతని చేతిలో టాట్టూ ఉన్నాయి`` అని తెలిపింది.

2018 డిసెంబర్ 1 న జోధ్ ‌పూర్ ‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో  ప్రియాంక- నిక్ వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిక్ మొత్తం కుటుంబం వేడుక‌ల‌కు హాజరయ్యారు. ఈ జంట ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లోని వారి విలాసవంతమైన నివాసంలో నివసిస్తున్నారు. వారికి మూడు కుక్కలు ఉన్నాయి. చివావా డయానా- జర్మన్ షెపర్డ్ గినో - పాండా అనే హస్కీ ఆస్ట్రేలియన్ షెపర్డ్ మిక్స్ డాగ్ ఉన్నాయి.
Tags:    

Similar News