షూట్ గ్యాప్ లో కార్ లో నిక్ ఏం చేశాడో తెలిస్తే షాకే

Update: 2020-12-15 03:43 GMT
ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోన‌స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. హ‌లీవుడ్ సినిమాల్లోకి ఎంట‌రైన ద‌గ్గ‌రి నుంచి పూర్తిగా ఇండియ‌న్ క‌ల్చ‌ర్ ‌ని మ‌ర్చిపోయింది అంటూ తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్న‌ ప్రియాంక వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌కి.. వ‌స్త్ర‌ధార‌ణ‌కి ప్రాధాన్య‌త‌నివ్వ‌డం సాంప్ర‌దాయ వాదుల్లో హీట్ పుట్టిస్తోంది. ఇప్ప‌టికే పీసీ ట్రోలింగ్ కి గురైన విష‌యం తెలిసిందే. పెళ్లి త‌రువాత కూడా నిక్ కార‌ణంగా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ‌

తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. ఈ సారి కూడా నిక్ కార‌ణంగానే ప్రియాంక వార్త‌ల్లో నిలుస్తోంది. మ‌రోసారి ప‌బ్లిక్ ‌గా రొమాన్స్ చేస్తూ నెటిజ‌న్ ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. వివాహానికి ముందు ప‌బ్లిక్ గా రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఈ జోడీ పెళ్లి త‌రువాత అడ్డు అదుపూ లుకుండా ప‌బ్లిక్ ‌గానే ముద్దులు పెట్టుకోవ‌డం చేస్తున్నారు. తాజాగా నిక్ ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించి ప్రియాంక‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించాడ‌ట‌.

`టెక్ట్స్ ఫ‌ర్ యూ` మూవీలో న‌టిస్తున్న ప్రియాంక ఈ మూవీ షూటింగ్ కోసం భ‌ర్త నిక్ ‌తో క‌లిసి లండ‌న్ వెళ్లింది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. షూటింగ్ గ్యాప్ ‌లో వ‌రుస పార్టీల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. అయితే ఇదే స‌మ‌యంలో కార్ లో ప్రియాంక‌తో నిక్ అడ్క‌న్స్ అయ్యాడ‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన ప్రియాంక వెంట‌నే అత‌న్ని కార్ ‌లోంచి తోసేసింద‌ని చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని పెంచిన‌ట్టు బాలీవుడ్ లో ఓ న్యూస్ చక్క‌ర్లు కొడుతోంది.
Tags:    

Similar News