ఆఫర్స్ కోసం గ్లామర్ షో చేయడానికి రెడీ అయిన 'లీడర్' బ్యూటీ...?
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లీడర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ తర్వాత తెలుగులో 'రామ రామ కృష్ణ కృష్ణ' '180' 'కో అంటే కోటి' చిత్రాలలో నటించింది. మళ్ళీ మరో తెలుగు చిత్రంలో కనిపించ లేదు. దక్షిణాదితోపాటు బాలీవుడ్ లో సినిమాల్లో కూడా నటించింది ప్రియా ఆనంద్. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా వచ్చిన 'ఇంగ్లిష్ వింగ్లీష్' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో 'రంగ్రేజ్' 'ఫుక్రేయ్' 'ఫుక్రేయ్ రిటర్న్స్' సినిమాల్లో నటించింది ప్రియా. ఇక తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇలా అన్ని ఇండస్ట్రీలలో అడుగుపెట్టినా ఎక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
కాగా అమ్మడు స్కిన్ షో చేయడానికి కూడా రెడీ అయినా సరే క్రేజీ ఆఫర్స్ మాత్రం దక్కడం లేదట. గత ఏడాది ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' సినిమాలో నటించింది ప్రియా ఆనంద్. అయినా ఈ సినిమా సక్సెస్ మరో హీరోయిన్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'సుమో' అనే తమిళ్ సినిమా కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఫోకస్ మొత్తం కన్నడ మలయాళ ఇండస్ట్రీలపై పెట్టింది. ఈ నేపథ్యంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరో పక్కన నటించిన ప్రియా ఆనంద్ ప్రస్తుతం శివ రాజ్ కుమార్ సరసన 'RDX' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ లు తెచ్చుకోలేకపోతున్న ప్రియ వేరే భాషలోనైనా స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుందేమో చూడాలి.