ఎంతైనా నటకిరీటి రాజేంద్రుని తర్వాతే..

Update: 2015-07-28 06:24 GMT
సీనియర్‌ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉన్నప్పుడు హాస్యనటుడిగా ఆయన తెరంగేట్రం చేశారు. ఎందరో గొప్ప మహానుభావుల దర్శకత్వంలో నటించారు. జంధ్యాల, బాపు, ఇవివి, పెద్ద వంశీ వంటి దిగ్ధర్శకుల నిర్ధేశకత్వంలో ఎన్నో క్లాసిక్స్‌లో నటించారు. రాజేంద్రుని సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై అత్యధిక టీఆర్‌ పీ ని ఇచ్చే సినిమాలు.

అందుకే భారతదేశ మాజీ ప్రధాని కీ.శే. పి.వి.నరసింహారావు అంతటివారే ఓ వేదిక సాక్షిగా రాజేంద్రుని ప్రశంసించారు. నాకు తీరిక సమయాలు చిక్కితే రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూస్తాను. అతడి సినిమాలు ఎంతో గొప్పగా నవ్విస్తాయి.. అని కీర్తించారు. ఓ నటుడికి అంతకుమించిన గొప్ప ప్రశంస ఇంకేమైనా ఉంటుందా? టాలీవుడ్‌లో ఇంతవరకూ వేరే ఏ ఇతర నటుడికి ఇలాంటి పొగడ్త దక్కలేదు. కానీ ఇంతకాలానికి అలాంటి అవకాశం ప్రభాస్‌ కి దక్కింది. అతడు నటించిన బాహుబలి సంచలనాలు సృష్టిస్తూ ప్రముఖుల్ని థియేటర్లకు రప్పిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతటివాడే స్వయంగా థియేటర్‌ కి వెళ్లి సినిమా చూస్తానని మాటిచ్చారు. బాహుబలి విజయం సాధించినందుకు ప్రభాస్‌ కి శుభాకాంక్షలు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత ఓ ప్రధానిచే అభినందనలు అందుకున్న రెండో హీరో ప్రభాస్‌ మాత్రమే.
Tags:    

Similar News