ఇప్పటి హీరోలకి అలాంటి రోల్స్ చేసే దమ్ముందా...?
టాలీవుడ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మన హోరోలని మనం ఎప్పుడూ హీరోయిజం వున్న క్యారెక్టర్స్ లోనే చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్ళు తమ పంధా మార్చి ప్రయోగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో స్టార్ యాక్టర్స్ ఒక్కసారిగా లేడీ గెటప్ లో కనిపించి అచ్చం అమ్మాయిల హావభావాలు చూపించి మనల్ని ఎంటర్టైన్ చేస్తే.. ప్రేక్షకులకు అంతకన్నా ఎంటర్టైమ్నెంట్ ఏమి కావాలి చెప్పండి. అయితే అలా లేడీ గెటప్ లో వచ్చి సినీ ప్రేక్షకులను అలరించిన వారిలో ఒకప్పటి సినీ నటులు ఉన్నారు కానీ ఈ జనరేషన్ లో లేరనే చెప్పాలి. అప్పటి స్టార్ హీరోలు సైతం లేడీ గెటప్స్ వేయడానికి వెనకాడేవారు కాదు. సాహసం చేసి ప్రయోగాలకు పూనుకునే వారు. కానీ ఇప్పటి హీరోలు ఇమేజ్.. ఫ్యాన్స్ అంటూ ఎక్కడలేని అడ్డుగోడలను కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని కూర్చున్నారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి హీరోలు లేడీ గెటప్స్ వేసి మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం 'చంటబ్బాయ్' సినిమా కోసం లేడీ గెటప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ అయితే 'భామనే సత్యభామనే' చిత్రంలో భామగా అలరించాడు. అంతేకాకుండా 'దశావతారం' సినిమాలో కూడా భామగా కనిపించాడు. కమల్ లేడీ పాత్రను పోషించి ప్రేక్షకును మంత్రముగ్దులను చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడానికి లేడీ గెటప్స్ కూడా కారణమయ్యాయి. టాలీవుడ్ లో లేడీ గెటప్స్ లో కనిపించిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి. 'మేడమ్' 'వివాహ బోజనంబు' 'ఆల్ రౌండర్' చిత్రాలలో లేడీ గెటప్స్ లో కనిపించి అద్భుతమైన నటన కనబరిచాడు. 'అత్తర సాయిబో రారా' అంటూ తెలుగు ప్రేక్షకులు నిజంగా లేడీ లా ఉన్నాడే అనుకునేలా చేసాడు. ఇక సీనియర్ హీరో నరేష్ కూడా 'చిత్రమ్ భలారే విచిత్రామ్' సినిమాలో లేడీగా కనిపించి టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించాడు. నందమూరి బాలకృష్ణ సైతం 'పాండురంగడు' చిత్రంలో సత్యభామగా లేడీ గెటప్ లో కనిపించి.. ఆడపిల్లగా హావభావాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ జనరేషన్ హీరోలలో అలాంటి సాహసాలు పెద్దగా చేయలేదనే చెప్పుకోవాలి. కాకపోతే ఒకరిద్దరు మాత్రం ఒకటి అర సీన్స్ లో కనిపించి అలరించే ప్రయత్నం చేసారు.
మంచు మనోజ్ 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా కోసం మోహిని గా మారాడు. ఇక అల్లు అర్జున్ డెబ్యూ మూవీ 'గంగోత్రి'లో మావయ్యది మొగల్తూరు అంటూ లేడీ గెటప్ లో స్టెప్పులేశాడు. సుమంత్ కూడా 'ఏమో గుర్రం ఎగురవచ్చు' మూవీలో చీరకట్టులో వయ్యారాలు పోతూ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. అయితే అప్పటి హీరోలు చేసిన విధంగా ఇప్పటి హీరోలు డేర్ చేయడం లేదనే చెప్పవచ్చు. వారు స్టోరీని నమ్మి పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసే వారు. కానీ ఇప్పుడు కుదిరితే స్టోరీ చేంజ్ చేయండి కానీ లేడీ గెటప్ మావల్ల కాదు అని చేతులెత్తేసే టైపుగా ఆలోచిస్తుంటారు. అయినా ఎప్పుడు మూస ధోరణిలో అవే సినిమాలు చేసుకుంటూ పోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేస్తేనే కదా వారిలో నటుడు బయటకి వచ్చేది. మరి రాబోయే రోజుల్లో లేడీ గెటప్స్ వేయడానికి హీరోలు డేర్ చేస్తారేమో చూడాలి.