పచ్చ చీర పంతులమ్మతో ప్రేమ!!

Update: 2016-09-28 13:38 GMT
ప్రేమమ్.. దసరాకి రిలీజ్ కానున్న ఈ మూవీ టాలీవుడ్ లో సెన్సేషన్స్ సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. మలయాళ మాతృక ప్రేమమ్.. అక్కడ పెద్ద హిస్టరీనే క్రియేట్ చేయడంతో.. ఇక్కడ కూడా అదే ఫీట్ రిపీట్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ అంచనాలను ఏ మాత్రం అందుకుంటుందో తెలియాలంటే.. అక్టోబర్ 7వరకూ ఆగాలి కానీ.. ఈలోపు ప్రేమమ్ కి ఫుల్లు క్రేజ్ తీసుకొచ్చేందుకు యూనిట్ బాగానే స్కెచ్ లు వేస్తోంది.

ప్రేమమ్ హీరోయిన్స్అనుపమా పరమేశ్వరన్.. మడొన్నా సెబాస్టియన్ లు కొత్త మలయాళీ భామలు కాగా.. మనకు తెలిసిన స్టార్  బ్యూటీ శృతి హాసన్ తో నాగ చైతన్య రొమాన్స్ ని స్పెషల్ గా ప్రొజెక్ట్ చేస్తోంది ప్రేమమ్ టీం. తాజాగా ఓ చైతు-శృతిలు బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో ఎల్లో కలర్ శారీ.. మ్యాచింగ్  బ్లౌజ్ వేసుకుని.. స్టూడెంట్ చైతు జోడీగా తోడుగా కలిసి నడుస్తోందీ ఈ పంతులమ్మ. ప్రేమమ్ లో శృతి హాసన్ చేస్తున్న పాత్ర లెక్చరర్ అనే సంగతి తెలుసు కదా.

ఇక ఈ మూవీలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లతోనూ అక్కినేని నాగచైతన్య తొలిసారిగా జత కడుతుండడం.. అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. రొమాంటిక్ మూవీలో ఫ్రెష్ కపుల్ ని.. అది కూడా మూడు కపుల్స్ ని చూసే అవకాశం ప్రేక్షకులకు వస్తోంది. 'ప్రేమ కథలు అంతం అవుతాయి.. ఆ భావనలు కాదు' అనే అర్ధం వచ్చే ట్యాగ్ లైన్ కూడా ఈ సినిమాకి సరిగ్గా సరిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News