• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రణీత తప్పు చేస్తోందా?!

ప్రణీత తప్పు చేస్తోందా?!

By - Tupaki Desk
Update: 2015-06-11 06:35 GMT
కథానాయికలంతా యువ హీరోల సినిమాలకే ప్రాధాన్యమిస్తుంటారు. సీనియర్‌ హీరోలకంటే యువ హీరోలతో కలిసి నటిస్తేనే కెరీర్‌కి మైలేజ్‌  ఉంటుందని నమ్ముతుంటారు.  ఒక్కసారి సీనియర్లతో కలిసి నటిస్తే ఆ తర్వాత మళ్లీ యువ హీరోల సరసన నటించే అవకాశాలు ఈజీగా దొరకవనే భయం కూడా వారిలో ఉంటుంది. అందుకే మంచి అవకాశాలొచ్చినా కొద్దిమంది సీనియర్లతో కలిసి నటించరు. అంతెందుకు ఆ మధ్య... వెంకీ సరసన నటించే అవకాశమొస్తే నిత్యమీనన్‌ తోసిపుచ్చింది. ఇంచుమించు కథానాయికలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. అయితే ప్రణీత మాత్రం ఇటీవల తీసుకొన్న ఓ నిర్ణయం అందరినీ షాక్‌ గురి చేసింది. ఆమె ఓ సీనియర్‌ కథానాయకుడి సినిమాలో నటించేందుకు ఒప్పుకొందట. ఆ నిర్ణయం విన్న చాలా మంది ప్రణీత తప్పు చేస్తోందని మాట్లాడుకొంటున్నారు.

  'అత్తారింటికి దారేది'లో పవన్‌కల్యాణ్‌ సరసన నటించిన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌ నుంచి వరుసగా అవకాశాలొచ్చాయి. అవి సక్సెస్‌ అయ్యింది లేదు కానీ... ప్రణీత మాత్రం మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చినట్టయింది. ఇప్పుడు కూడా విష్ణు సరసన 'డైనమైట్‌'లో నటిస్తోంది. మహేష్‌తో కలిసి 'శ్రీమంతుడు'లోనూ నటించబోతోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ దశలోనే ఓ సీనియర్‌ అగ్ర హీరో సినిమాలో రెండో కథానాయికగా ప్రణీత కనిపించబోతోందంటూ వార్తలొచ్చాయి. అవి విన్నవాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ప్రణీతకి ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని మాట్లాడుకొంటున్నారు. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతోనే ఆమె సినిమా చేయడానికి ఒప్పుకొందని కొద్దిమంది చెప్పుకొంటున్నారు.

Tags:    
  • Pranitha 
  • Tollywood Movies 
  • Telugu NEws 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS