స్టార్‌ నటుడి కొడుకు మామిడి కాయల వ్యాపారి

Update: 2020-04-27 12:30 GMT
కరోనా కారణంగా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను గత 40 రోజులుగా కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ లాక్‌ డౌన్‌ ఎప్పటి వరకు ఉంటుందో ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో సినీ సెలబ్రెటీలు పూర్తిగా వారి వారి ఇంటికే పరిమితం అవుతున్నారు. కుటుంబ సభ్యులతో పూర్తి సమయంను గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎప్పుడు సినిమాల షూటింగ్స్‌ ఇతరత్ర కార్యక్రమాలతో బిజీగా ఉండే స్టార్స్‌ ఇప్పుడు మాత్రం ఇతర పనులపై దృష్టి పెట్టారు.

ప్రకాష్‌ రాజ్‌ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌ హౌస్‌ లో ఉన్నాడు. పకృతి మద్య కొడుకుతో కలిసి హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్లుగా ఆయన ఇప్పటికే చేసిన ట్వీట్స్‌ తో అర్థం అయ్యింది. ఇక తాజాగా తన కొడుకును మామిడి కాయల మద్య కూర్చోబెట్టి నా కొడుకు మామిడి కాయల వ్యాపారి అయ్యాడు అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. తన తోటలోని మామిడి కాయలను తెంచి వాటిని ప్యాక్‌ చేసి సాయం కావాల్సిన వారికి పంపించాడు.

ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ పై పలువురు సరదాగా కామెంట్స్‌ చేశారు. ఈ మామిడి కాయల వ్యాపారికి వాటి రేటు ఎంతో తెలుసా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తే మరికొందరు మాత్రం మీరు బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నారు సర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ప్రకాష్‌ రాజ్‌ కొడుకు ఫొటో వైరల్‌ అయ్యింది.
Tags:    

Similar News