ప్రభాస్ 2వ సినిమా 'వార్' ను మించి ఉంటుందట!
ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఒకటి రెండు వారాల బ్యాలన్స్ వర్క్ మినహా విడుదలకు సిద్దం అయ్యింది. ఇక ప్రభాస్ ఆదిపురుష్ మరియు సలార్ ల సినిమా షూటింగ్స్ పరిస్థితులు అనుకూలిస్తే మూడు నాలుగు నెలల్లోనే పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక వచ్చే ఏడాదికి నాగ్ అశ్విన్ మూవీని వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ తాజాగా బాలీవుడ్ లో తన రెండవ సినిమా కు దాదాపుగా ఓకే చెప్పేశాడు. హిందీలో ప్రభాస్ మొదటి సినిమా ఆదిపురుష్ కాగా రెండవ సినిమా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందబోతుంది.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ గురించి బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వార్ సినిమా తో దర్శకుడిగా సిద్దార్థ్ ఆనంద్ స్టార్ డమ్ మరింతగా పెరిగింది. ప్రభాస్ తో చేయబోతున్న సినిమా ను అతడు వార్ ను మించిన యాక్షన్ మూవీగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా లో మరో స్టార్ కూడా ఉంటాడని అంటున్నారు. వార్ సినిమా లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లు నటించిన విషయం తెల్సిందే. మరి ప్రభాస్ తో ఎవరు నటిస్తారనేది చూడాలి.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్ మరియు సలార్ చిత్రాల తర్వాత వార్ దర్శకుడితో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. హిందీ ప్రేక్షకులు ఇప్పటికే ప్రభాస్ ఏ భాషలో సినిమా చేసినా కూడా ఆధరించేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక ఆయన హిందీ సినిమా చేస్తే మరింతగా బిజినెస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో సాహో మూవీ బాలీవుడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా రా ఏజెంట్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో ప్రభాస్ తన రెండవ హిందీ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.