క‌రోనా ఎఫెక్ట్: ప‌్ర‌భాస్ మాస్క్ వేశాడు!

Update: 2020-03-04 05:36 GMT
తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ భ‌యం అంత‌కంత‌కు పెరుగుతోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో క‌రోనా రోగి సంచ‌రిస్తున్నాడన్న వార్త‌ ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే రెండు క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక భాగ్య‌న‌గ‌రం ఏ క్ష‌ణాన ఎలా ఉంటుందోన‌ని బిక్కు బిక్కుమంటోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా ఎక్క‌డ నుంచి వ్యాపిస్తుందోన‌ని టెన్ష‌న్ ప‌డుతూ బ‌య‌ట తిర‌గాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతోంది. ఇక టాలీవుడ్ లోనూ క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే క‌నిపిస్తోంది. డౌట్ ప‌డ‌కుండా సెల‌బ్రిటీలంతా ముంద‌స్తు గా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

చాలామంది వీలైనంత వ‌ర‌కూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అత్యవ‌స‌ర‌ ప‌రిస్థితుల్లో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుని బ‌య‌ట‌కు వెళ్తున్నారు. షూటింగ్ ల‌కు హాజ‌రైనా ఆ ప‌ని పూర్తి చేసుకుని తిరిగి ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లోనూ టెన్ష‌న్ బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న త‌న‌ ముక్కుకు ఎయిర్ ఫిల్ట‌ర్ మాస్క్ ధ‌రించి ఎయిర్ పోర్టు లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. సినిమా షూటింగ్ కోసం ఔట్ డోర్ వెళ్తున్నారా? లేక మ‌రేదైనా ప‌నిమీద బ‌య‌ట‌కు వెళుతున్నారా? అన్న‌ది తెలియ‌దు గానీ ఎయిర్ పోర్టు ఎంట్రీ గేట్ లోప‌లికి వెళ్లున్న‌ట్లు ఓ ఫోటో లీకై సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోంది. భుజాన చిన్న బ్యాగ్ వేసుకుని ...నెత్తికి టోపీ పెట్టుకుని..ముక్కుకి మాస్క్ ధ‌రించి ఇలా కెమెరా కంటికి చిక్కారు.

అయితే ఇది హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టా? లేక విదేశీ ఎయిర్ పోర్టా? అన్న‌ది చూస్తే.. ఎయిర్ పోర్టులో కొన్ని అక్ష‌రాల‌ను బ‌ట్టి విదేశీ ఎయిర్ పోర్ట్ అని అర్థ‌మ‌వుతోంది. ఆ అక్ష‌రాలు చూస్తే అదో యూరోపియ‌న్ కంట్రీ అని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జాన్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. షూటింగ్ లో భాగంగా ప్ర‌భాస్ బిజీ బిజీగా ఉన్నారు.
Tags:    

Similar News