#ప్రభాస్20 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

Update: 2020-02-27 08:40 GMT
'బాహుబలి' ని సైన్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకూ ప్రభాస్ సినిమాలు చేసే స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ప్రభాస్ కొత్త  సినిమాల కోసం అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.  'సాహో' పోయినేడాది ఆగష్టులో విడుదలైంది.  ఆ సినిమాకు ముందే రాధాకృష్ణ కుమార్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఎక్కువ గ్యాప్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ కూడా డిలే అయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఇదో గుడ్ న్యూస్.

#ప్రభాస్20 ఈ ఏడాది అక్టోబర్ 16 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేశారని సమాచారం. అంటే ఈ ఏడాది దసరా సీజన్ కు #ప్రభాస్20 ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికే రిలీజ్ అని టాక్ వినిపించింది కానీ అది నిజం కాదట.  ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసే విషయాన్ని నిర్మాతలు రెగ్యులర్ బయ్యర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం.  ఈ సినిమాను యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తం గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  
 
ఈ పీరియడ్ ఫిలింలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.  'రాధే శ్యామ్'.. 'ఓ డియర్' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.  ఈమధ్య  ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ చిత్రాలలో నటించారు.. దీంతో ఈ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అనేఆసక్తి  ప్రేక్షకుల్లో నెలకొంది. 
Tags:    

Similar News