ట్రెండీ లుక్కులో పాన్ ఇండియా స్టార్..!
టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా స్టార్ అనే స్టార్డం సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమా నుండి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా అలరిస్తున్నాడు. అతని సినిమాలు కూడా అదే రేంజిలో తెరకేక్కిస్తున్నారు మేకర్స్. ప్రభాస్ సినిమాలలో ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో.. బయట అంత సింపుల్ గా కనిపిస్తాడు. అంతేగాక తను బయట కనిపించడానికి కూడా పెద్దగా ఇష్టపడడనే విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అలాగే దేశమంతటా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. తాజాగా ప్రభాస్ న్యూ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ట్రెండీ డ్రెస్సింగ్ స్టయిల్ తో స్టైలిష్ లుక్కులో ఆకర్షిస్తున్నాడు.
స్టైలిష్ బ్లాక్ టి-షర్ట్, డార్క్ బ్లూ ప్యాంటు ధరించి స్టైలిష్ గా కారు పక్కన నిలబడిన పోజులో ప్రభాస్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. ప్రభాస్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా సోషల్ మీడియాలో లైక్స్ షేర్స్ అంటూ వైరల్ చేస్తున్నారు. బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని న్యూ హెయిర్ స్టయిల్ తో దర్శనమిచ్చాడు. అసలే డార్లింగ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. మరి ఈ న్యూ లుక్ చూస్తే ఇంకేముంది అలా పడిపోతారాంతే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అలాగే రాధేశ్యామ్ సినిమా కూడా ఓవైపు విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అలరించేందుకు సన్నద్ధం అవుతున్నాడు.