• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దయచేసి బయటికి రాకండి:...

దయచేసి బయటికి రాకండి: పవర్ స్టార్ హీరోయిన్ ట్వీట్

By - Tupaki Desk
Update: 2021-05-04 23:30 GMT
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజురోజుకి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు లక్షల్లో బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా భయంతో వణుకుతున్నారు. ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ కరోనా బారినపడేవారి సంఖ్య మాత్రం అంతకంతకు రెట్టింపు అవుతోంది. దేశంలో ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఏమాత్రం కంట్రోల్ చేయలేని స్థితిలో ప్రస్తుతం దేశం పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పలువురు సినీ ప్రముఖులు ముందడుగు వేసి కేంద్రప్రభుత్వానికి విరాళం అందించడంతో పాటు ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తగు అవగాహనా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా సినీనటి కృతికర్బందా అభిమానులను, సామాన్య జనాలను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృతి ట్వీట్ చేసి.. కరోనా సమయంలో బయటికి వెళ్ళకండి. వెళ్లి మీ జీవితాలను రిస్క్ లో పడేయకండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. దయచేసి బయటికి రావొద్దు. గత 24 గంటలపాటు మా ఫ్యామిలీ నరకాన్ని చూసాం." అంటూ సూచించింది. కృతి ట్వీట్ చూసి చాలామంది స్పందించారు. కానీ ఆమె ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిందేమో.. అందుకే అలా ట్వీట్ చేసిందంటూ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి కృతి ఫ్యామిలీ పరిస్థితి గురించి పక్కనపెడితె ఆమె చెప్పిన మేటర్ మాత్రం నిజమే అంటూ మరికొందరు స్పందించారు. ప్రస్తుతం కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో పవర్ స్టార్ తో తీన్మార్, రామ్ తో ఒంగోలుగిత్త సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. చూడాలి మరి త్వరలో తీపికబురు చెబుతుందేమో!
Tags:    
  • kriti kharbanda 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS