ప‌వ‌న్ ని తాగుబోతుగా మార్చిన రియ‌ల్ ఇన్సిడెంట్

Update: 2020-12-15 05:49 GMT
ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ తో క‌లిసి దిల్ ‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

ప‌వ‌న్‌- శృతిహాస‌న్ ‌ల‌పై ఫ్లాష్ బ్యాక్ స‌హా కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ప‌వ‌ర్ ‌ఫుల్ లాయ‌ర్ ‌గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌రో కీల‌క పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ ‌రాజ్ క‌నిపించ‌నున్నారు. అంజ‌లి- నివేదా థామ‌స్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా వుంటే ఇందులో ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ పాత్ర‌లో కొత్త షేడ్ గురించి లీకులందాయి. ఆయ‌న ఇంట్ర‌డ‌క్ష‌న్ అభిమానుల‌ను షాక్ కి గురి చేస్తుంద‌ట‌. ప‌వ‌న్ తాగుబోతుగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. భార్య‌ని పోగొట్టుకున్న భ‌ర్త‌గా నిత్యం తాగుతూ క‌నిపిస్తార‌ని.. బాధ్య‌ల్ని మ‌రిచి వృత్తిని కూడా ప‌ట్టించుకోకుండా నిత్యం మ‌ద్యంమ‌త్తులో మునిగితేలుతుంటార‌ని అలాంటి వ్య‌క్తి ముగ్గురు అమ్మాయిల కేసుని టేక‌ప్ చేస్తే అది ఎన్ని మ‌లుపులు తిరిగింది?.. ఇందులో వ‌కీల్‌సాబ్ ఎలా విజ‌యం సాధించాడ‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తోంది.

మద్యం సేవించడం వంటి స‌న్నివేశాల్లో ప‌వ‌న్ చేసిన స‌న్నివేశాలు హ్యూజ్ హిట్‌లుగా నిలిచాయి. అదే త‌ర‌హాలో `వ‌కీల్‌సాబ్‌`లో ప‌వ‌న్ చేసిన స‌న్నివేశాలు కూడా అదే త‌ర‌హాలో ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లో రిలీజ్ కానున్న టీజ‌ర్ ‌లోనూ ఇదే స‌న్నివేశాల్ని చూపించ‌బోతున్నార‌ట‌.
Tags:    

Similar News