టిక్కెట్లు ఇవ్వలేదని పవర్‌ కట్‌ చేశారా?

Update: 2015-07-11 16:55 GMT
బాహుబలి టిక్కెట్ల దందా గురించి వినీ వినీ విసుగెత్తిపోయాం. ఈ సినిమా టిక్కెట్లను అడ్డగోలుగా బ్లాక్‌లో అమ్మేసి క్యాష్‌ చేసుకుంటున్నారని విన్నాం. పంపిణీదారులు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు అంతా కుమ్మక్కయి క్రేజును సొమ్ము చేసుకుంటున్నారని తిట్టుకున్నాం. అయితే ఈ టిక్కెట్ల కోసం కొట్లాటలో మరో కామెడీ ట్రాక్‌ గురించి తెలుసుకుని అవాక్కవ్వడం ఇప్పుడు మీ వంతు.

హైదరాబాద్‌ నగరంలో రద్ధీగా ఉండే ఓ ప్రధాన కూడలిలో ఉందా మల్టీప్లెక్స్‌. నిత్యం ట్రాఫిక్‌ అంతా నిలిచే చోటు అది. అందులోని థియేటర్‌లో బాహుబలి సినిమా ఆడుతోంది. అయితే ఆ పరిసరాల్లోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ అధికారులు కొందరు బాహుబలి టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా మల్టీప్లెక్స్‌ అధారిటీని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని పట్టు బట్టారు. అయితే అప్పటికే టిక్కెట్లన్నీ బుక్కయిపోయాయి. ఆన్‌లైన్‌లో సర్వర్‌ కూడా పనిచేయడం లేదు. వారం వరకూ ఇదే పరిస్థితి అని అట్నుంచి సమాధానం వచ్చింది. అక్కడితో ఆ సీన్‌ అయిపోయింది..

కట్‌ చేస్తే.. బాహుబలి షో మొదలయ్యేప్పటికి పవర్‌ కట్‌. షో మొత్తం జనరేటర్‌ పవర్‌పై నడిపించాల్సిన పరిస్థితి. అసలు ఆ ఏరియాలో కరెంట్‌ ఎందుకు పోయిందా అని ఆరాతీస్తే.. తమకు టిక్కెట్స్‌ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ అధికారులే ఈ కటింగ్‌ చేయించారని తెలుస్తోంది. ఎంత వరకు నిజమో కాని.. ఇది చాలా దారుణం.



Tags:    

Similar News