ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ కి చేదు వార్త.. రానుందా?

Update: 2020-05-09 16:30 GMT
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. సినిమా షూటింగులు ఆగిపోయాయి. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా ఎవరికీ తెలీదు. ఇంతలో వచ్చే సంవత్సరం జనవరి 8న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని అభిమానులు వాపోతున్నారు.

కానీ రాజమౌళి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ విడుదల గురించి స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ 70% పూర్తయిందని తెలిపాడు. కాబట్టి, మిగిలిన భాగాన్ని జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేస్తామని, పోస్ట్ ప్రొడక్షన్, ప్రచారాలకు ఇంకా తగిన టైమ్ లభిస్తుందని తెలిపాడు. 'మేము 2021 జనవరి 8న సినిమాను విడుదల చేయడానికి సంసిద్దంగా ఉన్నాం' అంటూ తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్పినవేవి జరగట్లేదట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ ఇలా చాలా పెండింగ్ లో ఉన్నాయట. అంతేగాక లాక్ డౌన్ లో అవేమి చేయడం కుదరట్లేదట. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలావరకు పూర్తికాలేదట.

కొన్ని రీషూట్ చేయాల్సిన సీన్స్ ఉన్నాయట. ఇన్ని పనులు ముందు పెట్టుకొని ఎప్పుడు ఫినిష్ చేస్తారని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక జనవరిలో రిలీజ్ చేస్తామన్న సినిమా షూటింగ్ పూర్తికావడానికే జనవరి వరకు సమయం పట్టేలా ఉందని సమాచారం. ఇదే గనక జరిగితే ఆర్ఆర్ఆర్ సినిమా సమ్మర్లో.. లేదా జులైలో రానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు చేదు వార్తే మిగిలేలా ఉంది. ఇక ఇప్పట్లో ఈ సినిమా గురించి అలోచించడం వృధా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి ఏదైనా అధికారిక ప్రకటన రానుందేమో..!
Tags:    

Similar News