పోసాని.. కొరటాలకు అంతిచ్చేవాడా?
90ల్లో పది వేల రూపాయలైనా చాలా పెద్ద మొత్తం. నెలకు ఐదంకెల జీతం సంపాదించేవాడంటే అప్పట్లో చాలా గొప్పగా చూసేవాళ్లు. ఐతే ఆ రోజుల్లోనే అసిస్టెంట్ రైటర్లయిన తమకు పోసాని నెలకు పాతిక వేలు ఇచ్చేవాడని.. అంత డబ్బు ఏం చేసుకోవాలో కూడా తమకు అప్పట్లో తెలిసేది కాదని అన్నాడు కొరటాల. పోసానికి దగ్గర బంధువైన కొరటాల.. తాను ఆయన దగ్గర ఎలా శిష్యరికం చేసింది.. ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.
‘‘నేను బీటెక్ చదివాక ఆరు నెలలు ఉద్యోగం కూడా చేశాను. రైటింగ్ అంటే ఆసక్తి ఉండటంతో సినిమాల వైపు వచ్చాను. చదువుకునే రోజుల నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ ఆసక్తితోనే పోసాని గారి దగ్గర అసిస్టెంటుగా చేరాను. ఆయన మా మేనత్త కొడుకే. అసిస్టెంటుగా చేరతానంటే ముందు వద్దన్నారు. మా ఇంట్లో వాళ్లు తిడతారని ఆయన భయం. ఐతే ఉద్యోగం చేస్తూనే కథా చర్చల్లో కూర్చునేవాడిని. తర్వాత ఉద్యోగం మానేసి ఆయన దగ్గరే చేరిపోయాను. ముందు నుంచి ఆయన దగ్గర నాకు చనువుంది. మా నాన్నకు ఆయనంటే చాలా ఇష్టం. పోసాని గారి పెళ్లి చూపులకు కూడా కలిసే వెళ్లాం. వయసు తేడా ఉన్నా ఇద్దరం బాగా క్లోజ్.
రచయితగా ఆయన దగ్గరే నేను రాటుదేలాను. 1998 రోజుల్లోనే నెలకు పాతికవేలు ఇచ్చేవారు. అప్పట్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు కూడా రూ.10 వేల జీతం ఇచ్చవాళ్లు కాదు. అప్పట్లో అన్ని డబ్బులు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మెస్ కార్డు రూ.600 ఉండేది. పోసానిగారి ఆఫీసులోనే ఉండేవాళ్లం. ఆయన దగ్గర పని చేసినన్నాళ్లూ కష్టం ఉండేది కానీ.. ఆర్థిక ఇబ్బందులైతే ఏమీ ఉండేవి కావు. ఆయన పని రాక్షసుడు. మూణ్నాలుగు గంటలు పడుకుంటే చాలనేవాడు. తెల్లవార్లూ రాస్తూ కూర్చునేవాళ్లం. ఆ కష్టం.. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోంది’’ అని కొరటాల చెప్పాడు.