మనిషిలోని జంతువును చూపించే ‘డర్టీ హరి’

Update: 2020-07-17 06:15 GMT
ఒక్కడు.. వర్షం.. నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాలతో నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్న ఎంఎస్‌ రాజు అనూహ్యంగా నిర్మాతగా కనుమరుగయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి వాన.. తూనీగ తూనీగ చిత్రాలతో కనిపించాడు. తాజాగా అడల్ట్‌ కంటెంట్‌ చిత్రం అయిన డర్టీ హరి ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో శ్రవణ్‌ రెడ్డి హీరోగా పరిచయం అవుతుండగా రుహాని శర్మ మరియు సిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఈ చిత్రంను డైరెక్ట్‌ గా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఆమద్య ప్రచారం జరిగింది.

తాజాగా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. మన చుట్టు ఉండే మనుషుల్లో దాగి ఉన్న జంతు ప్రవృత్తి నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుందట. సున్నితమైన ఎమోషన్స్‌ ను చూపిస్తూనే ఆకట్టుకునే కథనంతో చిత్రాన్ని దర్శకుడు ఎంఎస్‌ రాజు తెరకెక్కించాడట. ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందని అంటున్నారు.

ఈతరం యువతకు చిన్న మెసేజ్‌ ఇవ్వడంతో పాటు ఆకట్టుకునే రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని అంటున్నారు. డర్టీ హరి చిత్రం నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్‌ సినిమాపై యూత్‌ ఆడియన్స్‌ లో ఆసక్తిని కలిగిస్తుంది. ఇదే సమయంలో మనిషిలో కనిపించకుండా పోతున్న మానవత్వం తాలూకు విషయాన్ని కూడా చూపించబోతున్నాడట.
Tags:    

Similar News