ఆ హీరోయిన్ ప్రేమ-వైరాగ్యం ట్వీట్.. ఎవరి మీద?

Update: 2020-03-16 07:29 GMT
అందం చందం ఉన్నా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేని హీరోయిన్ పూనమ్ కౌర్. కత్తిలాంటి ఈ హీరోయిన్ కు సినిమా అవకాశాలు అయితే రాలేదు. ఆడపాదడపా చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరో వ్యవహారంలోకి ప్రవేశించి ఆయనపై హాట్ కామెంట్స్ చేసినప్పటి నుంచి ఈ హీరోయిన్ వార్తల్లో నిలిచారు. ఆ మధ్య వివాదాస్పద రివ్యూ రైటర్ కూడా స్టార్ హీరోకు, పూనమ్ కౌర్ కు సంబంధం అంటగట్టి అభాసుపాలు చేశాడు.

ప్రస్తుతం వివాదాస్పద ట్వీట్లు చేస్తూ పూనమ్ కౌర్ అగ్గిరాజేస్తోంది. తాజాగా మరో ట్వీట్ కూడా చేసింది. అయితే అందులో ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించకున్నా ఆ ట్వీట్ లోని పరమార్థం చూస్తే మాత్రం రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల బాట పట్టిన హీరో గురించే అని అర్థమవుతోంది.

పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ ‘డబ్బు హోదా ఉన్న వాడు రాజు అవ్వొచ్చు. కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడే వ్యక్తి వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు. వీరులు మిమ్ములను కాపాడుతారు. శాసించాలి అని తపన పడే మనిషిలో అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనే వ్యక్తులలో ప్రేమ వైరాగ్యం ఉంటుంది’ అంటూ తనలోని బాధను.. తనను ఎవరో మోసం చేశారన్న ఆవేదనను వెళ్లగక్కింది. మరి పూనమ్ ను మోసం చేసింది ఎవరు అని కింద నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టారు. అయినా వాళ్ల పర్సనల్ గొడవ మనకెందుకులే అని కొందరు సర్ధిపెట్టుకున్నారు.
Full ViewFull View
Tags:    

Similar News