బుట్ట‌బొమ్మ‌తో ఈ స్టార్ కిడ్ ఎవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా?

Update: 2021-02-03 07:30 GMT
`అల వైకుంఠ‌పుర‌ములో`(2020) లాంటి ఇండ‌స్ట్రీ హిట్ మూవీలో న‌టించింది పూజా హెగ్డే. ఈ మూవీతో త‌న‌ను బుట్ట‌బొమ్మ‌గా పాపుల‌ర్ చేశారు త్రివిక్ర‌ముడు. ఆ త‌ర్వాత పూజా కెరీర్ మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పూజా ల‌క్కీఛామ్ గా వెలిగిపోతోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన రాధేశ్యామ్.. అఖిల్ స‌ర‌స‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాలు త్వ‌ర‌లోనే రిలీజ్ కి రానున్నాయి.

త‌దుప‌రి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ మూవీకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం టీమ్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంది. తాజాగా పూజా హెగ్డే ఓ రేర్ ఫోటోని  ఆన్ సెట్స్ నుంచి షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఈ ఫోటోలో ముఖ్యంగా ఓ చురుకైన దివ్య‌మైన‌ రూపం క‌ట్టి పడేస్తోంది. ఆ అంద‌మైన క‌నుబొమ్మ‌లు... తీరైన పంటి వ‌రుస.. చురుకైన చూపులు.. కంటి పాప మెరుపులు.. వీట‌న్నిటినీ మించి ఆ ప‌క్క పాపిడి.. చూస్తుంటేనే వ్వావ్ అనాల్సిందే. ఇంత‌కీ ఎవ‌రీ గ‌డుగ్గాయ్? అన్న‌ది ఆరా తీస్తే షాకిచ్చే సంగ‌తే తెలిసింది.

ఆ చిన్నారి బాల‌కుడు జూనియ‌ర్  Jr. NTR. అంటే యంగ్ య‌మ ఎన్టీఆర్ జూనియ‌ర్ అన్న‌మాట‌. ఆన్ సెట్లో ప్లేయింగ్ విత్ Jr. Jr. NTR అంటూ ల‌వ్ ఈమోజీని పూజా షేర్ చేసింది. ఇప్ప‌టికి అర్థ‌మైంది క‌దా? ఆ చిన్నారి అభ‌య్ రామ్(6) అన్న సంగ‌తి. చూస్తుండ‌గానే ఎదిగేస్తున్నాడు. ఆరేళ్ల బాల‌కుడు ఇపుడు. ఆ రూపు రేఖ‌లు చూస్తుంటే డాడీ ఎన్టీఆర్ నే త‌ల‌పిస్తున్నాడు. తీరైన స‌మ్మోహ‌న‌ రూపంతో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇక నంద‌మూరి ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జెన్ బాల న‌టుడిగా.. అటుపైనా హీరోగా అత‌డే పెద్ద రేంజు చూపిస్తాడ‌న‌డంలోనూ ఎలాంటి సందేహం లేదు. నంద‌మూరి వంశం నుంచి తార‌క రాముని లెగ‌సీని నిల‌బెట్టే వార‌సుడి రూపం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News