• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సానియా మీర్జా బ‌యోపిక్‌...

సానియా మీర్జా బ‌యోపిక్‌ లో?

By - Tupaki Desk
Update: 2018-09-28 04:17 GMT
క్రీడా నేప‌థ్యం ఉన్న బ‌యోపిక్‌ లు న‌టీన‌టుల‌ మైలేజ్‌ ని అమాంతం పెంచేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. మేరీకోమ్‌ - స‌చిన్‌ - ధోని బ‌యోపిక్‌ లే అందుకు ఎగ్జాంపుల్. ఆయా సినిమాల్లో లైఫ్‌ లో ఎమోష‌న్‌ ని ఆడియెన్ వోన్ చేసుకున్నారు. స్ఫూర్తిగా భావించారు. అందువ‌ల్ల బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిసింది. అందుకే ఇప్పుడు క్రీడాకారుల బ‌యోపిక్‌ ల వెల్లువ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇటీవ‌లే బ్యాడ్మింట‌న్ క్వీన్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రారంభ‌మైంది. సైనా పాత్ర‌లో శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ఖ్యాత టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఆ క్ర‌మంలోనే ప‌లువురు క్రీడాకారిణుల బ‌యోపిక్‌ లు తీసేందుకు ఫిలింమేక‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాదీ టెన్నిస్  ప్లేయ‌ర్ సానియా మీర్జా - క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌ బ‌యోపిక్‌ లు తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ త‌ర‌హా బ‌యోపిక్‌ ల‌లో న‌టించేందుకు ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆస‌క్తి చూపించ‌డం విశేషం. ఇటీవ‌లే ఓ చిట్‌ చాట్ లో పూజా మాట్లాడుతూ-``సానియా - మిథాలీ రాజ్ బ‌యోపిక్‌ లు తీస్తే న‌టించాల‌న్న‌ ఆస‌క్తి ఉంది`` అని వెల్ల‌డించారు. క్రీడాకారులు - అథ్లెట్ల బ‌యోపిక్‌ లు చేస్తాన‌ని తెలిపారు. పూజా బాడీ లాంగ్వేజ్ అథ్లెటిక్ త‌ర‌హా కాబ‌ట్టి అంద‌కు సూట‌వుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

ప్ర‌స్తుతం ఈ ముంబై బ్యూటీ వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఎన్టీఆర్ - అర‌వింద స‌మేత‌ - మ‌హేష్ - మ‌హ‌ర్షి చిత్రాల‌తో బిజీ. త‌దుప‌రి ప్ర‌భాస్- జిల్ రాధాకృష్ణ కాంబినేష‌న్ మూవీ సెట్స్‌ కి వెళ్ల‌నుంది. క్రీడాకారిణుల జీవిత‌క‌థ‌ల్లో న‌టించాల‌న్న ఆస‌క్తి  కేవ‌లం ముంబై భామ‌ల్లోనే కాదు తెలుగ‌మ్మాయిల్లోనూ ఉంది. చాందిని - యామిని భాస్క‌ర్ లాంటి తెలుగ‌మ్మాయిలు క్రీడాకారిణుల‌ బ‌యోపిక్‌ ల‌లో న‌టించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని ఇదివ‌ర‌కూ ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు.


Tags:    
  • Pooja Hegde 
  • Sania Mirza Biopic 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS