బుట్ట బొమ్మ స్లోమోష‌న్ ఎఫెక్టులు సంథింగ్ హాట్!

Update: 2022-01-07 14:30 GMT
బుట్ట‌బొమ్మ‌గా తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకుంది పూజా హెగ్డే. 2020 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో త‌న రేంజు మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది. ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది పూజా. ఇక ఈ బ్యూటీ ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం యోగా జిమ్ సెష‌న్స్ నుంచి ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది.

తాజాగా స్లో మూవ్ మెంట్స్ తో క‌స‌ర‌త్తులు చేయ‌డ‌మెలాగో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని పూజా షేర్ చేసింది. జిమ్ కోచ్ స‌మ‌క్షంలో ఎంతో ఒడుపుగా చేతులు కాళ్ల‌ను క‌దులుస్తూ న‌డుము వంచి శ్ర‌మిస్తూ పూజా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇలాంటివి చూసినంత వీజీ కాదు చేయాలంటే. ఎంత స్లోగా చేస్తే అంత రిజ‌ల్ట్ ఉంటుంది.. కానీ అంత సులువు కాదు.

పూజా హెగ్డే తీవ్రమైన వర్కవుట్ సెషన్ వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వీడియో ఆద్యంతం నెమ్మదిగా నియంత్రిత కదలికలతో పూజా మ‌తులు చెడ‌గొడుతోంది! ట్రైన‌ర్ స‌మీర్ పురోహిత్ సార‌థ్యంలో ఇలా ప్ర‌త్యేకించి శిక్ష‌ణ పొందుతోంది. పూజా ఎల్ల‌ప్పుడూ సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలతో అభిమానులను ప్రేరేపిస్తోంది. అలాగే ఆమె పైలేట్స్ క్లాస్ తర్వాత జిమ్ వెలుపల ఫోజులు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఫిట్ నెస్ తో పాటు తన ఫ్యాషన్ గేమ్ ను కూడా సీరియస్ గా తీసుకుంటుంది పూజా.

పూజా న‌టించిన రాధే శ్యామ్ సంక్రాంతి కానుక‌గా జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న పూజా నాయిక‌గా న‌టిస్తోంది.  ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా ఓమిక్రాన్ ప్ర‌భావంతో రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే కొరటాల శివ తెర‌కెక్కించిన‌ ఆచార్యలో కూడా పూజా న‌టించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించ‌గా.. రామ్ చరణ్ స‌ర‌స‌న పూజా క‌నిపించ‌నుంది.  కాజల్ అగర్వాల్ చిరు స‌ర‌స‌న‌ కనిపించనున్నారు. ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ - కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ కూడా 2022లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో విజయ్ స‌ర‌స‌న పూజా న‌టించింది. సెల్వరాఘవన్- యోగి బాబు- షైన్ టామ్ చాకో- వీటీవీ గణేష్- అపర్ణా దాస్- లిల్లీపుట్ ఫరూఖీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Full View
Tags:    

Similar News