బుట్ట బొమ్మను బీస్ట్ బొమ్మ అనాలేమో?
మూడు భాషల్లో బిజీ నాయికగా కొనసాగుతోంది పూజా హెగ్డే. తెలుగులో ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్టందుకుంది. తదుపరి సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న రాధేశ్యామ్ లో కథానాయికగా నటించింది. ఇందులో విక్రమాధిత్య (ప్రభాస్) ప్రియురాలు ప్రేరణగా నటించింది.
మరోవైపు తమిళంలో భారీ మూవీ చిత్రీకరణను ముగించింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తన తదుపరి చిత్రం బీస్ట్ షూటింగ్ ను ముగించినట్లు పూజా హెగ్డే శుక్రవారం తెలిపారు. ఈ కామెడీ-యాక్షన్ థ్రిల్లర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ రచన -దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ కి సన్ పిక్చర్స్ పెట్టుబడుల్ని సమకూరుస్తోంది. సదరు సంస్థ వీడియో సందేశంతో పాటు షూటింగ్ ను ముగించిన వార్తలను పంచుకోవడానికి సోషల్ మీడియాలోకి వెళ్లింది.
తొమ్మిదేళ్ల విరామం తర్వాత తమిళ చిత్రంలో తిరిగి నటిస్తున్న పూజా హెగ్డే బీస్ట్ లో పని చేయడం తనకు ప్రతిష్ఠాత్మకమని చెప్పారు. బీస్ట్ లో నటించడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా ఉల్లాసంగా షూటింగ్ చేశారు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది ఒక సెలవును ఆస్వాధిస్తున్నట్టుగా అనిపించింది. సెట్స్ పైకి వెళితే చాలా ఆనందం కలిగించేది. మేము షూటింగ్ ను చాలా ఇష్టంతో చేశాము... అని తెలిపారు. నెల్సన్ మార్క్ ట్రీట్ మెంట్ తో విజయ్ సర్ శైలిలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోంది. పాపం ఈ రోజు బీస్ట్ కి నా చివరి రోజు. నేటితో నా పోర్షన్ కి షూట్ ముగింపు పలికాను`` అని 31 ఏళ్ల పూజాహెగ్డే వెల్లడించింది. విజయ్ తో హెగ్డే మొదటి సినిమా అయిన బీస్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే సెట్స్ పైకి వెళ్లింది. గత వారంతో 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చిరంజీవి - రామ్ చరణ్ లతో యాక్షన్ డ్రామా ఆచార్య.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ నటించిన హిందీ చిత్రం సర్కస్ ..సల్మాన్ తో కభీ ఈద్ కభీ దీపావళి విడుదలకు రావాల్సి ఉంది. హెగ్డే లైనప్ లో ఉన్నాయి. ప్రభాస్ తో రాధేశ్యామ్ సంక్రాంతికి విడుదలవుతోంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ డిజైనర్ లుక్ చూడగానే..బుట్ట బొమ్మ బీస్ట్ అవతారం! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. బీస్ట్ బొమ్మ అనాలేమో? అని ఫ్యాన్స్ వ్యాఖ్యల్ని జోడించడం ఆసక్తికరం.