వీడియో: బుట్ట బొమ్మ `వీ` షేప్ జిమ్ వెరీ స్పెష‌ల్

Update: 2020-08-28 12:30 GMT
రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ జాబితా తిర‌గేస్తే అందులో టాప్ 10లో పూజా హెగ్డే పేరు ఉండాల్సిందే. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా.. జిమ్... యోగా సెష‌న్స్ ని అస్స‌లు స్కిప్ కొట్ట‌దు. నిరంత‌రం 2 గంట‌ల స‌మ‌యం దీనికోస‌మే కేటాయిస్తుంది. ఇక అన్ని ఆరోగ్య నియ‌మాలు పాటిస్తూ చ‌క్క‌ని ఆహారం తీసుకుంటుంది కాబ‌ట్టి టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేయ‌గ‌లుగుతోందిట‌.

పూజా నిరంత‌రం త‌న వ‌ర్క‌వుట్లు స‌హా యోగా ఫోటోల్ని ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేస్తూనే ఉంది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీ షేప్ లో పూజా జిమ్ చేస్తున్న ఓ వీడియో నెటిజ‌నుల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ``చానెలింగ్ మై ఇన్న‌ర్ హ్యాపీ.. గో ల‌క్కీ డాల్ఫిన్ డే.. భుజాల‌పైనా ఇత‌ర సున్నిత భాగాల‌పై ఒత్తిడిని పెంచే ప్ర‌త్యేక వ‌ర్క‌వుట్ ఇది`` అని పూజా తెలిపింది.

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌న‌కు బుట్ట బొమ్మ అన్న ఇమేజ్ ని ఇచ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తోంది. అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలోనూ పూజా న‌టిస్తోంది. త‌దుప‌రి త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమాలోనూ నాయిక‌గా న‌టించ‌నుంది.
Tags:    

Similar News