కమల్ మాట ఇప్పుడు కేసుగా మారింది

Update: 2017-03-22 04:23 GMT
ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ కు మరో చిక్కొచ్చి పడింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేసుగా మారి ఆయనకుకొత్త చిక్కులు తెచ్చి పెట్టనున్నాయ్. ఇటీవల ఆయన ఓ ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయటమే కాదు.. కోర్టులో కేసుగా నమోదైంది.

ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. తమిళనాట మహిళలపై అత్యాచారాలు ఎక్కువ కావటంపై ఒక ప్రశ్నను.. టీవీ ఇంటర్వ్యూలో భాగంగా అడిగారు.దీనికి స్పందించిన కమల్ హాసన్.. మహాభారతంలో మగువలను ఫణంగా పెట్టి జూదం ఆడినట్లుగా చదివిన ప్రజలున్న ప్రాంతమిదని.. కాబట్టి ఇలాంటివి జరగటంపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు భారతీయులు పంచమ వేదంగా భావించే మహాభారతానికి కళంకం తెచ్చేలా ఉందంటూ కన్యాకుమారి జిల్లా అంజు గ్రామానికి చెందిన హిందూ మక్కళ్ కట్చి కార్యకర్త.. 31 ఏళ్ల ఆదినాద సుందరం ఒక పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన వల్లియూరు కోర్టు విచారణకు స్వీకరించింది. నాస్తికవాదిగా ఉన్న కమల్ వ్యాఖ్యలు గర్హనీయమని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి కోరుతున్నారు. మరోవైపు హిందూమక్కళ్ కట్చి కార్యకర్తలు కమల్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడకుంటే లేనిపోని సమస్యలు వస్తాయన్నవిషయాన్ని కమల్ లాంటి వారు గుర్తించకపోవటం ఏమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News