జేమ్స్ బాండ్ ని చూసి ఏం నేర్చుకుంటారో!?

Update: 2016-10-22 04:32 GMT
పియర్స్ బ్రాస్నన్.. దశాబ్ద కాలం పాటు మన జేమ్స్ బాండ్. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ సిరీస్ లో అందరికంటే అందగాడైన బాండ్ గా గుర్తింపు పొందిన ఈయన.. రీసెంట్ గా ఇండియన్స్ కు పెద్ద షాక్ నే ఇచ్చాడు. ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇంతకంటే షాకింగ్ న్యూస్ చెప్పాడు మాజీ జేమ్స్ బాండ్. 'నేను మహిళల ఆరోగ్యం జాగ్రత్తలపై దశాబ్దాలుగా కేంపెయిన్ చేస్తున్నాను. కేవలం బ్రీత్ ఫ్రెష్నర్ కి మాత్రమే నేను అగ్రిమెంట్ సైన్ చేశాను. అది కూడా పొగాకు.. సుపారీ లాంటి అనారోగ్యం కలిగించేవి లేని ప్రొడక్టుకు మాత్రమే.  నా ఫోటోను అనధికారికంగా.. పాన్ మసాలా ప్రొడక్టులపై వినియోగించడం షాక్ కి గురి చేసింది. నా మొదటి భార్య.. కూతురు.. కొందరు స్నేహితులు కూడా క్యాన్సర్ తో మృతి చెందారు. ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. నా మూలంగా బాధపడ్డ వారందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా' అంటూ సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పియర్స్ బ్రాస్నన్.

ఈ జేమ్స్ బాండ్ ఇలా చెప్పకపోయినా.. క్షమాపణలు కోరకపోయినా.. అడిగేవారెవరూ ఉండరు. కానీ వ్యతిరేతను చూసి తనే ముందుకొచ్చాడు. కానీ మన దేశంలో మాత్రం.. లిక్కర్ కంపెనీలకు కూడా యథేచ్చగా ప్రకటనలు ఇచ్చేస్తూ ఉంటారు మన హీరోలు. కోట్లు కురిపిస్తామంటే చాలు.. ఎలాంటి యాడ్ అయినా చేసే స్టార్లు బోలెడు మంది ఉన్నారు. వీళ్లంతా ఈ ఇంటర్నేషనల్ స్టార్ ని చూసి ఏమైనా నేర్చుకుంటారా అన్నదే అసలు ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News