పిక్ టాక్: లేగ దూడను ముద్దు చేస్తున్న శర్వా..!

Update: 2021-01-01 09:38 GMT
2020 ఏ ఒక్కరికీ ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవడంతో 2021లో అయినా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. తీవ్ర నష్టాలు చవి చూసిన సినిమా ఇండస్ట్రీలో న్యూ ఇయర్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ అంటూ సందడి చేస్తున్నారు. యువ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న తాజా చిత్రం ''శ్రీకారం'' నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదల చేయబడింది. ఇందులో శర్వానంద్‌ ఓ లేగ దూడను ముద్దుచేస్తూ కనిపిస్తున్నాడు. శర్వా యువ రైతు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఇది పర్ఫెక్ట్ పోస్టర్ అని చెప్పవచ్చు. ఇంతకముందు రైతు దినోత్సవం నాడు శర్వా వ్యవసాయ ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నట్లు చూపించారు.  ఇప్పుడు దూడ తో ఉన్న ఫోటోని రిలీజ్ చేస్తూ శర్వా పాత్ర తీరును వెల్లడించే ప్రయత్నం చేశారు.

కాగా, వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌ పై రామ్ ఆచంట‌ - గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శర్వా కి జోడీగా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్‌ నటిస్తోంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. జె యువరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్‌ - మురళి శర్మ - రావు రమేష్‌ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Tags:    

Similar News