• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్: కామ్రేడ్ సిద్ధ...

పిక్ టాక్: కామ్రేడ్ సిద్ధ తో కలసి నవ్వులు చిందిస్తున్న 'ఆచార్య' 'సృష్టికర్త' ..!

By - Tupaki Desk
Update: 2021-06-15 10:30 GMT
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో తనదైన శైలిలో సందేశం ఇవ్వాలని చూసే కొరటాల ఈ చిత్రాన్ని కూడా అదే తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిరు - చెర్రీ ఇద్దరూ నక్సలైట్ గెటప్స్ లో చేతిలో తుపాకులు పట్టుకొని కనిపించి అభిమానులను అలరించారు. దీంతో కొరటాల తండ్రీకొడుకులని ఒకే స్క్రీన్ పై ఏ స్థాయిలో చూపిస్తారో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.

ఇకపోతే నేడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దర్శకుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా కొరటాల తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశాడు. 'ఆచార్య' సెట్ లో తీసిన ఈ పిక్ లో చరణ్ - శివ ఇద్దరూ ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. సిద్ధ గెటప్ లో చెర్రీ ఆకట్టుకుంటున్నాడు. కాగా, 'ఆచార్య' కంటే ముందే కొరటాల డైరెక్షన్ లో చరణ్ నటించాల్సి ఉంది. బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇన్నాళ్లకు 'ఆచార్య' తో అలరించడానికి వస్తున్నారు.
Tags:    
  • Koratala Siva 
  • Koratala Siva Movies 
  • Aacharya 
  • Chiranjeevi 
  • Ram Charan 
  • Aacharya Movie Shooting 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS