ఫోటో స్టోరి: ఫ‌్లైట్ దిగి కూల్ గా బాద్ షా

Update: 2020-11-29 06:51 GMT
శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు మాటు వేసి మ‌రీ ప‌ట్టేస్తున్నారు సెల‌బ్రిటీల్ని. షూటింగుల కోసం విమానాశ్ర‌యాల్లో సంచ‌రించే టాప్ హీరోలు .. హీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్ ని క్యాచ్ చేసేందుకు కొన్ని జాతీయ మీడియాల కెమెరాలు నిరంత‌రం కాపు కాసుకుని మ‌రీ వెయిట్ చేస్తుంటాయి.

అలా ఇటీవ‌ల సెల‌బ్రిటీల ఎయిర్ పోర్ట్ లుక్ ల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మాస్క్ తొడిగి.. పీపీఈ కిట్ల‌తోనూ దొరికిపోయారు చాలా మంది సెల‌బ్స్. ఇదిగో లేటెస్టుగా ఆర్.ఆర్.ఆర్ షూటింగుతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇలా శంషాబాద్ లో కెమెరా కంటికి చిక్కారు. ఆయ‌న ఊబ‌ర్ కూల్ లుక్ పై అభిమానులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తార‌క‌రాముడు ఎక్క‌డ ఉన్నా ఆ స్టైలే వేరు. కూల్ గా ప్లెజెంట్ గా ఉంటాడు. అత‌డి రూపానికి త‌గ్గ డిజైన‌ర్ లుక్ తో ఆక‌ర్షిస్తాడు. క్యాజువల్ - కూల్ లుక్ తో ఈసారి కూడా క‌నిపించాడు. ఆకుపచ్చ టీ-షర్టు క్రీమ్-రంగు చినోస్ కలయికతో  స్టైలిష్ గా ఎన్టీఆర్ లుక్ మైమ‌రిపిస్తోంది.

జ‌క్క‌న్న పీరియడ్ డ్రామా ఆర్ ఆర్ ‌ఆర్ షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ తో సినిమాని ప‌ట్టాలెక్కించాల్సి ఉంటుంది. త‌దుప‌రి ఇత‌ర ప్ర‌ముఖ బ్యాన‌ర్ల‌లోనూ తార‌క్ న‌టించ‌నున్నాడు.
Tags:    

Similar News