• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘మగధీర’ టైంలో 19 ఎముకలు...

‘మగధీర’ టైంలో 19 ఎముకలు విరిగాయి

By - Tupaki Desk
Update: 2016-09-27 09:30 GMT
పీటర్ హెయిన్స్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు వాడు కాదు.. అసలు ఇండియనే కాదు. కానీ మన దగ్గర ఏ భారీ సినిమా మొదలైనా యాక్షన్ కొరియోగ్రఫీ కోసం అతణ్నే ఆశ్రయిస్తారు దర్శకులు. ముఖ్యంగా మగధీర.. రోబో.. ఐ.. బాహుబలి లాంటి సినిమాలతో అతడి పేరు మార్మోగిపోయింది. వియత్నాంకు చెందిన పీటర్.. ప్రస్తుతం బాహుబలి-2.. రోబో-2 లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి సినిమాలకు పని చేయడం అన్నిటికంటే కష్టమైన విషయం అని చెప్పాడు. మగధీర.. బాహుబలి సినిమాలు రెంటికీ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు.

యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తనకు తగిలే దెబ్బల గురించి చెబుతూ.. ‘‘ఇప్పటి వరకూ నాకు గుర్తుండి నా బాడీలో 49 ఎముకలు విరిగాయి. అర్ధసెంచరీకి చేరువగా ఉన్నా. ఒక్క మగధీర సినిమా షూటింగ్ టైంలోనే 19 ఎముకలు విరిగాయి. ఐతే నాలోని క్రేజీ ఫైట్ మాస్టర్ ఇవన్నీ పట్టించుకోడు’’ అని పీటర్ హెయిన్స్ చెప్పాడు. కొరియోగ్రాఫర్ గా ఇంత పేరు సంపాదించిన పీటర్ కు అసలు ఫైట్లంటే నచ్చవట. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్ హాయ్’ సినిమాలో అసలు ఫైట్లే ఉండవని అతను వెల్లడించాడు. ‘‘నేను పేరుకే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌. కానీ ఫైట్లంటే నాకు ఇష్టముండదు. అందుకే దర్శకుడిగా చేస్తోన్న తొలి సినిమా పూర్తి వైవిధ్యంగా ఉండాలని అనుకున్నాను. అలా వచ్చిన ఆలోచనతో ‘సమ్‌ హాయ్‌’ తీస్తున్నాను. నా సొంత దేశం వియత్నాంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. పీటర్‌ హెయిన్స్‌ అంటే కేవలం యాక్షన్‌ సినిమాలే కాదు అని చెప్పడానికి ఈ సినిమా చేస్తున్నాను. తండ్రీ బిడ్డల మధ్య అనుబంధాన్ని చెప్పే సినిమా ఇది. ఫైట్లు ఇందులో ఉండవు. పోరాట సన్నివేశాలంటే ఒక పెద్ద అబద్ధం. అందుకే నా సినిమాలో వాటి జోలికి పోను’’ అని పీటర్ చెప్పాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Peter Hein 
  • Telugu NEws 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS