• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్టర్ పీటర్ హెయిన్.....

డైరెక్టర్ పీటర్ హెయిన్.. హీరో అతనా?

By - Tupaki Desk
Update: 2019-09-20 09:50 GMT
తండ్రిది వియ‌త్నాం. త‌ల్లిది పుదుచ్చేరి. ఎక్కువ పేరు తెచ్చిందేమో తెలుగు సినిమాలు. ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్ నేప‌థ్య‌మిది. పుట్టింది ఇండియాలోనే అయినా.. తండ్రి దేశ‌మైన వియ‌త్నాంకు వెళ్లి మార్ష‌ల్ ఆర్ట్స్ స‌హా అనేక ఫైట్ల‌లో ఆరితేరి.. ఆ నైపుణ్యాన్నంతా ఇండియ‌న్ సినిమాల్లో చూపిస్తూ శ‌ర‌వేగంగా ఎదిగాడు పీట‌ర్. బాహుబ‌లి - మ‌న్యంపులి - రోబో - మ‌గ‌ధీర‌ - అప‌రిచితుడు.. ఇలా ఎన్నో భారీ చిత్రాల్లో అద్భుత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని తీర్చిదిద్ది లెజెండ‌రీ స్టేట‌స్ సంపాదించాడ‌త‌ను. జాతీయ అవార్డుల్లో రెండేళ్ల కింద‌ట తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన ఉత్త‌మ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ పుర‌స్కారాన్ని మొద‌ట‌గా అందుకున్న‌ది పీట‌రే. ఇప్పుడ‌త‌ను ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) పీట‌ర్‌ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడు.

కొన్ని రోజుల గురించి ఈ ప్రాజెక్టు గురించి బుజ్జి వెల్లడించాడు. ఐతే అప్పుడు హీరో ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు. ఫైట్ మాస్టర్‌ గా పీటర్ స్థాయే వేరు. బాహుబలి - రోబో లాంటి సినిమాలకు పని చేసిన ఘనుడు. దేశంలో అతనే నంబర్ వన్ యాక్షన్ కొరియోగ్రాఫర్. అలాంటి టెక్నీషియన్.. దర్శకుడిగా మారుతూ పెద్ద స్టార్‌ తోనే సినిమా తీస్తాడని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో తన డెబ్యూ మూవీ తీయబోతున్నాడట పీటర్. ఆయన రేంజికి ఈయన హీరో ఏంటి అనే సందేహం కలగడం ఖాయం. కానీ పీటర్‌ ను దర్శకుడిగా పరిచయం చేయనున్న బుజ్జికి బెల్లంకొండ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. శ్రీనివాస్ తొలి సినిమాలో బుజ్జికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆయన శ్రీనివాస్‌ తో సినిమా తీయడానికైతే తాను రెడీ అన్నాడట. మరి డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత అలా కోరుకున్నపుడు పీటర్ ఏం చేస్తాడు మరి. సర్దుకుపోతున్నట్లున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది.
Tags:    
  • Peter Hein 
  • Bellamkonda Srinivas 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS