జ‌న‌వ‌రిలో ఫ్యాన్స్ కి ప‌వన్ మ‌రో స‌ర్ ప్రైజ్‌!

Update: 2022-12-16 16:30 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రిలో స‌ర్ ప్రైజ్ న్యూస్ రాబోతోందా? అంట అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల నిత్యం జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల‌లో బిజీగా వుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లో న‌టిస్తున్నారు. ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

గ‌త కొంత కాలంగా షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని పూర్తి చేసి ఆ త‌రువాత పెండింగ్ లో వున్న మూవీస్ కి వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇందులో భాగంగానే `సాహో` ఫేమ్ సుజీత్ తో ఓ భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.  

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్ వినిపించ‌బోతున్నార‌ట‌. రీసెంట్ గా త‌మిళ హిట్ ఫిల్మ్ `తేరీ` ఆధారంగా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`ని లాంఛ‌నంగా మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద హంగామా చేశారు. ఈ రీమేక్ ని ఆప‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ ఓ లేడీ ఫ్యాన్ ఏకంగా సూసైడ్ నోట్ నే పోస్ట్ చేయ‌డంతో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది.

అయినా స‌రే ప‌వ‌న్ కానీ, మైత్రీ వారు కానీ, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కానీ ఆ బెదిరింపుల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాము అనుకున్న `తేరీ` రీమేక్ ని మొత్తానికి ప‌ట్టాలెక్కించేశారు. రెగ్యుల‌ర్ షూటింగ్ ని కూడా మొద‌లు పెట్టేశారు. ఇప్పుడు ఇదే జోష్ తో మ‌రో రీమేక్ ని కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ని తెలిసింది. త‌మిళంలో స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లో న‌టించి తెర‌కెక్కించిన మూవీ `వినోదాయ సితం`.

ఇదే సినిమాని తెలుగులో స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ రీమేక్ స్టోరీ, డైలాగ్ ల‌ని ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా పూర్తి చేశార‌ట‌. ప‌వ‌న్ బిజీగా వుండ‌టంతో ఈ రీమేక్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌నే వార్త‌లు వినిపించాయి. అయితే పీపుల్ మీడియా వారు ఈ మూవీని జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. ఈ రీమేక్ విష‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News