హీరోలతో గొడవలపై పవన్ స్పందన!

Update: 2016-08-25 06:56 GMT
కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురైన వినోద్ అనే పవన్ కల్యాణ్ వీరాభిమాని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వినోద్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ గురువారం తిరుపతిలో పరామర్శించారు. కుంటుంబానికి అండగా ఉంటానని, ఈ విషయంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతానని అన్నారు. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ బాద్యత పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదని - ఒకవేల రాష్ట్రప్రభుత్వం గనుక ఈ విషయంలో విఫలమైతే సీబీఐ విచారణకూడా కోరతామని తెలిపారు.

అనంతరం సినిమా ఇండస్ట్రీ - హీరోలు - వారి మధ్య గొడవలపై స్పందించిన పవన్.. హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవలు పడరని చెప్పారు.  హీరోలంతా బాగానే కలిసి మెలిసి ఉంటారని.. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం గొడవలు పడతారని చెప్పారు. తోటి హీరోలతో తనకు ఎప్పుడూ, ఎలాంటి గొడవలు లేవని పవన్ అన్నారు. ఇక మరణించిన వినోద్ విషయంలో అసలు ఏం జరిగింది - ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్ పోలీసు స్టేషన్ నుంచి పూర్తి వవరాలు తెలుసుకుంటానని పవన్ చెప్పారు.

సినీ పరిశ్రమలో అందరూ కలిసి మెలిసే ఉంటామని - తమమధ్య ప్రొఫెషనల్ పోటీతత్వం ఉంటుంది గానీ.. ఇలా గొడవలు పడే స్థాయిలో ఉండవని.. కానీ అభిమానుల మధ్య మాత్రం అలాంటి పరిస్థితులులు ఉండటం విషాదకరమని తెలిపారు. అభిమానం అనేది కొంతవరకే ఉండాలని, అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, కత్తులతో పొడుచుకోవడం - చంపుకోవడం అనే స్థాయికి అభిమానాలు వెళ్లడం ఎవరికీ ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
Tags:    

Similar News