పవన్‌ తొందరపడ్డాడా? బాగా రాశాడా?

Update: 2016-07-25 17:30 GMT
చాలా గొప్ప క్లాసిక్స్ అనుకున్న కొన్ని సినిమాలు.. మన దర్శకులు కేవలం 10 రోజుల్లోనే రెడీ చేసిన స్ర్కిప్టులు తెలుసా? పోకిరి సినిమా కోసం పూరి జగన్ కేవలం వారంపాటు బ్యాంకాక్‌ లో కూర్చొని చెక్కేశాడట. ఇక ఏళ్ళ తరబడి చెక్కిన స్ర్కిప్టులు అట్టర్‌ ఫ్లాపులు అయిన ఉదంతాలు అనేకం. వీటికీ పవన్‌ కళ్యాణ్‌ కు ఇప్పుడు లింకేంటి అనుకుంటున్నారా?? అక్కడికే వస్తున్నాం.

నిజానికి రెండు సంవత్సరాల పాటు కష్టపడి తయారుచేసిన ''సర్దార్‌'' సినిమా ఫ్లాపైందంటే పవన్‌ కళ్యాణ్‌ కే అందరికంటే గట్టి షాక్‌ తగిలింది. అందుకే ఇప్పుడు టైమ్ తీసుకోకుండా డాలీ డైరక్షన్ లో చేసే సినిమాను కేవలం 3 నెలలో కంప్లీట్‌ చేసేశాడు. కాకపోతే ఎవరికైనా వచ్చే సందేహం ఏంటంటే.. రెండు సంవత్సరాలు రాసినా అది ఆడలేదు కాబట్టి.. ఇప్పుడు పవన్‌ తొందరపడ్డాడా? లేకపోతే గత ఫెయిల్యూర్ నుండి నేర్చుకుని ఈసారి స్ర్కిప్టును కత్తిలా రాశాడా? సర్దార్ సినిమాలో చూసినవన్నీ.. 90లలో వర్కవుట్ చేయాల్సిన ఐడియాలు. ఇప్పుడు ట్రెండ్ మారాక పాత కాలంనాటి కామెడీ నుండి సీన్ల లాజిక్కుల వరకు పేల్లేదు. మరి రెండు సంవత్సరాల ప్రిపరేషన్లో ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకుని ఉంటే.. ఇప్పుడు చేస్తున్న స్ర్కిప్టును 3 నెలల్లో రాయడం పెద్ద విషయం కాదు.

ఇంతకీ పవన్‌ రాసిన కథ ఏంటసలు? డాలీ డైరక్టు చేయబోయేది ఒక యాక్షన్‌ ఎంటర్టైనరేనా లేకపోతే ఒక లవ్ స్టోరీనా? ముందు నుండీ తొలిప్రేమ - తమ్ముడు - ఖుషీ వంటి ప్రేమకథలు బాగా అచ్చొచ్చాయ్ కాబట్టి.. ఈసారి ప్రేమ కథను తయారుచేశాని టాక్‌. శృతి హాసన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 6 నుండి మొదలవుతున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News