నిశ్చితార్థానికి బాబాయ్ ఎందుకు స్కిప్ కొట్టారు?

Update: 2020-08-14 04:45 GMT
వేడుక‌లు ఫంక్ష‌న్లు అంటే కొంద‌రికి స‌రిప‌డ‌వు. అవి ఫ్యామిలీ ఫంక్ష‌న్లు అయినా లేక వేరే బంధుమిత్రుల ఇండ్ల‌లో జ‌రిగినా వాటి గురించి ఆలోచించేందుకు కొందరు సిద్ధంగా ఉండ‌రు. వైబ్రేంట్ లైఫ్ స్టైల్ కంటే రిజ‌ర్వ్ డ్ గా ఆధ్యాత్మిక చింత‌న‌తో ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. ఆ కేట‌గిరీకే చెందుతాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న‌ను నేరుగా ఏ ఫంక్ష‌న్ లోనూ అభిమానులు చూసిందే లేదు. అరుదుగా వీరాభిమానుల కోసం మాత్ర‌మే టైమ్ కేటాయిస్తుంటారు.

ఇక త‌న కుటుంబంలో జ‌రిగే ఈవెంట్ల‌లోనే ప‌వ‌న్ క‌నిపించ‌డు. ఇది ఇప్పుడే చూస్తున్న‌ది కాదు.. చాలా కాలంగా ఆయ‌న తీరు ఇంతే. నిన్న‌టిరోజున అన్న‌య్య నాగ‌బాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థంలోనూ ప‌వ‌ర్ స్టార్ క‌నిపించ‌నే లేదు.  నిహారిక‌-చైత‌న్య జంట‌ నిశ్చితార్థం ఆల్బ‌మ్ వెతికితే ఏ ఫోటోలోనూ ప‌వ‌న్ క‌నిపించిందే లేదు. అయితే అప్ప‌టిక‌ప్పుడే వ‌చ్చి హ‌డావుడిగా ప‌వ‌న్ వెళ్లిపోయారా?  లేక కెమెరా మేన్ క్యాప్చుర్ చేయ‌లేదా? అన్న‌దానికి కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.

ఈయ‌న చ‌ర్య‌లు ఊహాతీతం అన్న‌ త్రివిక్ర‌మ్ డైలాగ్ లానే ప‌వ‌న్ చ‌ర్య‌లు ఊహాతీతమే. ఇటీవ‌లే త‌న ప్రియ‌శిష్యుడు నితిన్ పెళ్లికి ముందు సెల‌బ్రేష‌న్స్ కి విచ్చేసిన ప‌వ‌న్ ఇప్పుడు సొంత ఫ్యామిలీ ఫ్యాంక్ష‌న్ ని స్కిప్ కొట్టాడు. అయితే అన్న‌య్య కుమార్తె నిహారిక అంటే అత‌డికి వ‌ల్ల‌మాలిన అభిమానం. ఇక నిహారిక‌కు ప‌వ‌న్ బాబాయ్ అంటే అంతే గొప్ప ప్రేమాభిమానం. ఇంత‌కుముందు జ‌న‌సేన పార్టీకి నిహారిక ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. స్కిప్ కొట్టాడా లేక వేరే కార‌ణం వ‌ల్ల రాలేక‌పోయాడా? ఇలా వ‌చ్చి అలా వెళ్లాడా? అన్నదానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల్లో న‌టించాల్సి ఉంది. క‌థాచ‌ర్చ‌ల‌తో పాటు ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేసే ప‌నిలోనూ ప‌వ‌న్ హ‌డావుడిగా ఉన్న సంగ‌తి విధిత‌మే.


Tags:    

Similar News