పవన్ తో వినోద్ తల్లి.. న్యాయం కావాలి!

Update: 2016-08-25 06:52 GMT
సినిమా హీరోల అభిమానులు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి - కత్తితో దాడులు చేసుకునేవరకూ వ్యవహారం రావడం అనంతరం వినోద్ అనే పవన్ కల్యాణ్ అభిమాని మృతిచెందడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షులు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం తిరుపతిలోని వినోద్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంటికి రాగానే వినోద్ తల్లి... పవన్ పై పడి కన్నీరుమున్నీరయ్యింది. అనంతరం.. జరిగిన మొత్తం విషయాన్ని తల్లితండ్రులను అడిగి తెలుసుకున్నారు పవన్.

ఈ సమయంలో.. తన కుమారుడు జనసేన పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పని చేసేవాడని చెబుతూ.. వాటికి సంబంధించిన ఫోటోలను పవన్ కి చూపించారు వినోద్ తల్లి. తన కొడుకు మరికొద్ది రోజుల్లో అమెరికా వెళ్లవలసి ఉందని ఇలాంటి సమయంలో ఈ ఘాతుకం జరిగిందని చెబుతూ బోరున విలపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి రప్పించి.. ఈ కేసుపై పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వినోద్ తల్లి పవన్ కి కోరారు. అనంతరం పవన్ ను అన్నా అని సంభోదించిన వినోద్ తల్లి... పవన్ కు రాఖీ కట్టారు. వినోద్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు - సోదరి కూడా పవన్ తో మాట్లాడారు. వినోద్ మృతి చెందే ముందు కూడా జై పవన్ - జై జై పవన్ అనే అన్నాడని వారు పవన్ తో చెప్పారు.

కాగా... పవన్ రాకకు ముందు మాట్లాడిన వినోద్ తల్లి.. పవన్ నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరం లేదని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే చాలని చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ తో కూడా చెప్పిన వినోద్ తల్లి.. "అన్నా.. తమకు ఎలాగైనా న్యాయం చేయాలి నా కొడుకును చంపిన వాడికి కఠిన శిక్ష పడాలి" అని ఆమె దీనంగా అర్థించారు.
Tags:    

Similar News