పవన్ అక్కడ పాఠాలు చెప్పాడు

Update: 2016-09-25 11:30 GMT
ఆ మధ్య ఓ సందర్భంలో బాగా గడ్డం పెంచుకుని కనిపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ గడ్డమంతా తీయించుకుని.. నార్మల్ లుక్ లోకి రావడానికి పవన్ బెంగళూరుకు వెళ్లడం తెలిసిన సంగతే. అక్కడ అతను కొన్ని రోజుల పాటు జిమ్ లో వర్కవుట్స్ కూడా చేశాడు. తాజాగా ఇప్పుడు ‘కాటమరాయుడు’ సినిమా కోసం రెడీ కావడానికి పవన్ మళ్లీ బెంగళూరుకే వెళ్లడం తెలిసిన సంగతే. అక్కడే రోజూ వ్యాయామశాలకు వెళ్తూ వర్కవుట్లు అవీ చేస్తున్నాడు పవన్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఈ మధ్య బయటికి వచ్చాయి. కొందరు అభిమానులతో కలిసి ఫొటోలు కూడా దిగాడు పవన్.

ఐతే కేవలం అభిమానులతో ఫొటోలు దిగడమే కాదు.. వారికి కొన్ని జీవిత పాఠాలు కూడా పవన్ నేర్పించడం విశేషం. తన ఐడియాలజీని నమ్మే అభిమానుల్లో మానసిక పరివర్తన తేవడానికి కూడా పవన్ ప్రయత్నించాడు. కేవలం నోటి మాటలతో సరిపెట్టేయకుండా నోట్ బుక్ తీసుకుని.. అందులో తాను చెప్పదగలుచుకున్న పాయింట్లన్నీ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాశాడు పవన్. ఏం చేసినా అది మన నియంత్రణలోనే ఉండాలని చెబుతూ.. ఇతరులకు ఇబ్బంది ఏ పనైనా చేయొచ్చని సూచించాడు పవన్. డబ్బు సంపాదించాలని.. ఇంట్లో వాళ్లను పోషించాలని.. అది అన్నిటికంటే ముఖ్యమని పనవ్ పేర్కొన్నాడు. మోరల్ స్ట్రెంత్ గురించి.. గోల్ గురించి కూడా పవన్ సూచనలు చేశాడు. మన లాగే ఆలోచించే వ్యక్తులతో కలిసి పోరాటాలు చేయాలని.. వేరే ఊళ్లలో ఇలాంటి పోరాటాలు చేసిన వాళ్ల నుంచి సహకారం తీసుకోవాలని.. సపోర్టర్లను పెంచుకోవాలని కూడా పవన్ సూచించాడు. పవన్ చెప్పిన ఈ పాఠాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Tags:    

Similar News