ఐరన్ లెగ్ అనిపించుకున్న బ్యూటీకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్...!

Update: 2020-08-25 23:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నటుడు నిర్మాత బండ్ల గణేష్ కి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కమెడియన్ స్థాయి నుండి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్' సినిమా నిర్మించాడు. ఈ సినిమా పరాజయం పాలైనా పవన్ పిలిచిమరీ 'గబ్బర్ సింగ్' సినిమాకి ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ కి బాధ్యతలు అప్పగించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా.. పవన్ కళ్యాణ్ ని ప్లాపుల నుంచి బయటపడిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాతో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.. ఐరన్ లెగ్ గా ముద్రపడిన శృతి హాసన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

కాగా, 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకోవమని పవన్ కళ్యాణ్ సూచించాడట. అప్పటికే తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' 'ఓ మై ఫ్రెండ్' వంటి ప్లాప్ చిత్రాలలో నటించిన శృతి హాసన్ కి టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అయితే పవన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా శృతి నే హీరోయిన్ గా రికమెండ్ చేశారట. అంతేకాకుండా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో 'శృతి హాసన్ ఫ్లాపుల్లో ఉందని.. అందుకే ఈ అమ్మాయి మనకు వద్దని' అన్నాడట. అయితే దానికి పవన్ కళ్యాణ్ 'నువ్వు నేను ఏమైనా అన్నీ సూపర్ హిట్స్ ఇచ్చామా?' అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడట. ఈ సినిమా శృతి హాసన్ కెరీర్ కి ఎంతటి ప్లస్ అయిందో అందరికి తెలిసిందే. ఇకపోతే శృతి హాసన్‌ ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ తో 'కాటమరాయుడు' సినిమాలో నటించింది. అంతేకాకుండా ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
Tags:    

Similar News