పవన్ మళ్లీ ఆ టైపులో ట్రై చేస్తున్నాడట

Update: 2017-02-27 11:23 GMT
తెలుగులో జానపద గీతాలను అందరూ మరిచిపోయిన టైంలో తన సినిమాలో ఆ తరహా పాటలకు చోటిచ్చి మళ్లీ వాటిపై ఆసక్తి రేకెత్తించాడు పవన్ కళ్యాణ్. తన సినిమాల్లో మొదట్నుంచి ఫోక్ టచ్ ఉన్న పాట ఒక్కటైనా ఉండేలా చూసుకునేవాడు పవన్. ఖుషి.. జానీ.. గుడుంబా శంకర్.. పంజా లాంటి సినిమాల్లో ఆ తరహాలో పాటలు వినొచ్చు. మధ్యలో పవన్ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ మిస్సయ్యాయి. ఐతే ఇప్పుడు మళ్లీ ‘కాటమరాయుడు’లో ఆ తరహా పాట ఒకటి పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పవన్ స్టయిల్లో ఒక ఫోక్ టచ్ ఉన్న పాటను కంపోజ్ చేశాడట. రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యాన్ని అందించినట్లు తెలుస్తోంది.

‘కాటమరాయుడు’ కోసం అనూప్ కొన్ని నెలల కిందటే ట్యూన్స్ రెడీ చేసేశాడు. ఐతే అందులో ఒకట్రెండు ట్యూన్స్ మార్చినట్లు తెలుస్తోంది. అందులో ఈ ఫోక్ టచ్ ఉన్న పాట కూడా ఒకటని సమాచారం. ప్రస్తుతం ఆడియోకు ఫైనల్ టచ్ ఇస్తున్నారట. ఇంకో రెండు వారాల్లో ఆడియోను రిలీజ్ చేయాల్సి ఉంది. పవన్ సినిమా చేస్తున్న మాస్ సినిమాకు తగ్గట్లుగా అనూప్ ట్యూన్స్ ఇవ్వగలడా అన్న సందేహాలున్నాయి జనాల్లో. ఐతే అనూప్ ఆ సందేహాల్ని పటాపంచలు చేసే ఆడియోతో రెడీ అవుతున్నట్లు సమాచారం. మార్చి 24న ‘కాటమరాయుడు’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’లో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News