ఇలా చేశావేంటి అనూప్..?

Update: 2017-03-19 04:32 GMT
అనూప్ రూబెన్స్ మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడనడంలో సందేహం లేదు. అతడి ప్రతిభ ఏంటన్నది ఇష్క్.. మనం లాంటి సినిమాలే చెబుతాయి. కానీ మాస్ మసాలా సినిమాలు చేయాల్సి వస్తే మాత్రం అతను ఆశించిన ఔట్ పుట్ ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంలో ‘టెంపర్’ లాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతడి మీద ఎంతో నమ్మకం పెట్టి ‘కాటమరాయుడు’లో అవకాశమిచ్చాడు. తనను అంతగా నమ్మినపుడు పవన్ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగా మాంచి ఊపున్న పాటలిస్తాడని ఆశించారు. కానీ అనూప్ అంచనాల్ని అందుకోలేకపోయాడు.

మొన్నటిదాకా ‘కాటమరాయుడు’లోంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆడియో వేడుకకు ముందు పాటలన్నీ ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ ఆడియో ‘ఏవరేజ్’ స్థాయికి మించి లేదని తేల్చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అట్టర్ ఫ్లాప్ అయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో సైతం ఇంత కంటే మెరుగైన పాటలే ఉన్నాయని జనాలు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిర్రా మిర్రా మీసం.. లాగే లాగే మినహా పాటలేవీ అంత ఆకట్టుకునేలా లేవని.. మొత్తంగా పవన్ సినిమా అంటే అభిమానులు ఆశించే ఊపు ఆడియోలో కనిపించట్లేదని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కు మరో ‘గబ్బర్ సింగ్’ కాగలదని ఆశిస్తున్న ‘కాటమరాయుడు’లో మ్యూజిక్ మాత్రం ఆ స్థాయిలో లేదని.. దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. తన కెరీర్లోనే బెస్ట్ ఆల్బం ఇస్తానన్న అనూప్ ఇలా చేశాడేంటా అని సోషల్ మీడియాలో అతడి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పాటలు మరీ తీసిపారేయదగ్గవి కాదు కానీ.. పవన్ సినిమాకు తగ్గట్లు ఊపున్న పాటలైతే అనూప్ ఇవ్వలేదన్నది స్పష్టం. ఆడియోలో అంతంతమాత్రంగా అనిపించిన పాటలు.. తెరమీదైనా బెటర్ గా అనిపిస్తాయేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News