ప‌వ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గ‌ట్టిగానే ఉంటుందా?

Update: 2021-08-29 12:30 GMT
మెగా కాంపౌండ్ లో వ‌రుస ఈవెంట్లు మెగాభిమానులకు స్పెష‌ల్ ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ర‌క్షా బంధ‌న్ రోజు క‌లిసి రావడంతో అందుకు సంబంధించిన సెల‌బ్రేష‌న్ ఒక రేంజులో సాగింది. ఆ ఫోటోలు వీడియోల‌ను అభిమానులు వైర‌ల్ గా షేర్ చేశారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో బిగ్ డే ఉంటుందా? అంటే.. అందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ప‌వర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా బిగ్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని.. `గ‌బ్బర్ సింగ్` కాంబినేష‌న్ పై క‌చ్చితంగా అప్ డేట్ ఉంటుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తో ప‌వ‌న్ త‌న 28వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది గానీ త‌ర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు.

`గ‌బ్బ‌ర్ సింగ్` చిత్రాన్ని మించిపోయేలా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్‌ హీట్ పెంచ‌డం మిన‌హా అస‌లు సంగ‌తిని అత‌డు ఇంత‌వ‌ర‌కూ రివీల్ చేయ‌లేదు. తాజాగా అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. ఆ తేదీని క‌చ్చితంగా ఆస‌క్తిక‌ర‌ అప్ డేట్ ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో బిగ్ డేకి టైటిల్ అనౌన్స్ మెంట్ స‌హా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది.. ప‌వ‌న్ క‌టౌట్ ఎలా ఉండ‌బోతుంది వంటి విష‌యాలు రివీల్ చేసే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి `సంచారి` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. అయితే ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది ఆరోజే బ‌య‌ట‌ప‌డే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్ల` చిత్రంలో...సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్` చిత్రంలో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు 28వ చిత్రంపైనా అభిమానుల అంచ‌నాలు పెరుగుతుండ‌డం విశేషం.

బుట్ట‌బొమ్మ‌తో ప‌వ‌న్ రొమాన్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ఆన్ సెట్స్ కి వెళ్ల‌గా ఇటీవ‌లే భీమ్లా నాయ‌క్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించి వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. రెండు సినిమా షూటింగుల‌కు గ్యాప్ లేకుండా డేట్లు కేటాయించి ప‌వ‌న్ సెట్స్ కి హాజ‌ర‌వుతున్నారు. వీలైనంత వేగంగా రెండు సినిమాల్ని పూర్తి చేసి ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. ప‌వ‌న్ ఇమేజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా.. అభిమానుల్ని మెప్పించే ప‌క్కా మాస్ కంటెంట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని హ‌రీష్ ప్రామిస్ చేసారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ సంబంధించిన ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. బెస్ట్ న‌టీన‌టుల్ని..సాంకేతిక నిపుణుల ఎంపిక ప‌నుల్లో త‌ల‌మ‌నుక‌లై ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కాంపౌండ్ నుంచి ఆస‌క్తిక‌ర విష‌యం లీకైంది. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా పూజాహెగ్డేని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క్రేజీ భామ‌గా వెలిగిపోతున్న పూజాహెగ్డే అయితే సినిమాకు క‌లిసొస్తుంద‌ని హ‌రీష్ భావిస్తున్నాడుట‌. పూజా పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించ‌డం కూడా త‌న సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని.. అందుకే భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసి  డేట్లు లాక్ చేయాల‌ని పావులు క‌దుపుతున్నార‌ని తెలిసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని హ‌రీష్ శంక‌ర్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డితో సినిమాని కూడా ప్ర‌క‌టిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం అఖిల్ క‌థానాయ‌కుడిగా ఏజెంట్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ స్క్రిప్ట్ ని ర‌డీ చేసి వినిపించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.
Tags:    

Similar News