సంక్రాంతి బరిలో బాలయ్య, పవన్

Update: 2017-10-15 15:30 GMT
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ స్పెషలే. ఏటా సంక్రాంతి నాటికి కనీసం రెండు మూడు కొత్త సినిమాలు థియేటర్లలో కనిపిస్తుంటుంది. ఈ సీజన్ లో సినిమా హిట్టయితే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. ఈ సీజన్ పై సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందుకే ఈ పండగకు సినిమా రిలీజయ్యేలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు.

వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - బాలకృష్ణలు పోటే పడే అవకాశం కనిపిస్తోంది. వీళ్లిద్దరి సినిమాలు రిలీజ్ డేట్ ఎప్పుడనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనప్పటికీ ఆయా సిని్మాల నిర్మాతలు ఆ టైంకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తమిళ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈ సినిమా జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు అత్తారింటికి దారేది వంటి హిట్ కాంబినేషన్ తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కూడా జనవరి 10 నాటికి థియేటర్లకు వస్తుందని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ - అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుండటంతో ఈ సినిమా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. అత్తారింటికి దారేదిలా ఈ మూవీ కూడా ఫ్యామిలీ డ్రామా కావడంతో అభిమానుల్లో బజ్ విపరీతంగా ఉంది. ఈ సినిమా థియేటరికల్ రైట్స్ భారీ మొత్తం పలుకుతోందనేది లేటెస్ట్ టాక్.
Tags:    

Similar News