• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోయిన్ 'పిఆర్'గా...

స్టార్ హీరోయిన్ 'పిఆర్'గా చేసి.. వెంటనే కో-స్టార్ అయ్యాను: పరిణితి చోప్రా

By - Tupaki Desk
Update: 2021-06-11 10:30 GMT
సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతుంటారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందుకే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ సీక్రెట్స్ అనేవి వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా తన సినీ ప్రయాణంలో ఎదురైనా అనుభవాలు మెమొరీస్ షేర్ చేసుకుంది. తాజాగా పరిణితిని ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మతో అనుబంధం గురించి.. అసలు ఆమెతో పరిచయం ఎలా అయిందో అడిగారు.

ఆ ప్రశ్నకు పరిణితి స్పందించి.. 'తాను హీరోయిన్ కాకముందే యష్ రాజ్ ఫిలిమ్స్ లో వర్క్ చేసానని. ఆ టైంలో హీరోయిన్ అనుష్క నటించిన బ్యాండ్ బాజా భారత్ సినిమాకు అనుష్క పిఆర్ గా వర్క్ చేసినట్లు తెలిపింది. అలాగే ఆ సినిమా టైంలోనే అనుష్క ఇంటర్వ్యూస్ - డేట్స్ కూడా చూసుకున్నట్లు చెప్పింది. అయితే అనుష్కకు పిఆర్ గా వర్క్ చేసిన మూడు నెలల్లోనే 'లేడీస్ వర్సెస్ రిక్కీ భాల్' సినిమాతో సహానటిగా నటించినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయంతో పాటు పరిణితి అనుష్కతో కలిసి దిగిన త్రోబ్యాక్ పిక్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం పరిణితి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో తన అభిమానులతో సంభాషిస్తూ.. తన లేడీ క్రష్ ఎవరనే విషయం కూడా బయటపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన లేడీ క్రష్ అనుష్క శర్మనే అని చెప్పి వారి అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. అయితే ఫస్ట్ మీటింగ్ నుండే అనుష్కను ప్రతి విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నట్లు పరిణితి తెలిపింది. తాజాగా పరిణితి పోస్ట్ పై అనుష్కశర్మ స్పందించి.. అదే త్రోబ్యాక్ ఫోటోపై 'బిగ్ హగ్స్' అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పరిణితి చోప్రా టర్కీలో ఉందట. అక్కడే తన సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అమ్మడు బీచ్ లో బికినీ ధరించి ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం పరిణితి రణబీర్ కపూర్ సరసన 'అనిమల్' అనే సినిమా చేస్తోంది. మరోవైపు అనుష్కశర్మ 'ఖాలా' అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ నిర్మిస్తోంది.
Tags:    
  • Parineeti Chopra 
  • Anushka Sharma 
  • Tollywood 
  • Telugu News 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS