ఆర్జీవీకి కౌంటర్ గా 'పరాన్నజీవి' ఫస్ట్ లుక్...!
రామ్ గోపాల్ వర్మ ''పవర్ స్టార్'' కి పోటీగా పవన్ కళ్యాణ్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ మీద సెటైరికల్ గా రూపొందుతున్న ఈ సినిమాకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ''పరాన్నజీవి'' సినిమా నుండి 'పరాన్నజీవి.. జీవి నిర్జీవి ఆర్జీవీ..' అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేసారు.
కాగా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ''పవర్ స్టార్'' మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు దానికి పోటీగా ''పరాన్నజీవి'' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ గోపాల్ వర్మని ఇమిటేట్ చేసే జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ని ఈ సినిమాలో ఆర్జీవీగా చూపించబోతున్నారు. ఈ పోస్టర్ లో షకలక శంకర్ ఒక అమ్మాయి తొడలపై క్లోజ్ షాట్ పెడుతున్నట్లు వర్మ శైలిలో డిజైన్ చేసారు. అంతేకాకుండా ఆర్జీవీ ని టార్గెట్ చేస్తున్నట్లు డైరెక్ట్ గా చెప్పకుండా "PARANNAGEEVI" టైటిల్ పోస్టర్ లో 'R G V' లెటర్స్ హైలైట్ అయ్యేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా దీనికి ' Reckless Genetic Virus' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.
ఇక ''పవర్ స్టార్'' సినిమాని జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేస్తునట్లు వర్మ ప్రకటించగా.. "పరాన్నజీవి" చిత్రాన్ని కూడా అదే రోజు అదే సమయానికి శ్రేయాస్ ఈటీ ఏటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మొత్తం మీద ఇప్పుడు సినీ అభిమానులందరూ ఒకరిపై ఒకరు సెటైరికల్ గా తీస్తున్న ''పవర్ స్టార్'' "పరాన్నజీవి" సినిమాల గురించే చర్చించుకుంటున్నారు. మరి రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ ఇవ్వడానికి తీస్తున్న "పరాన్నజీవి" సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.