సంక్రాంతి కి రెడీ అవుతున్న పందెంరాయుళ్లు

Update: 2018-12-15 08:30 GMT
సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తికొచ్చేది ముగ్గులు- బొడ్డెమ్మలు. గాలిపటాలు- కొత్త అల్లుళ్ల సందడి. హరికీర్తనలు- ఆటపాట వైగరా.. మరీ ముఖ్యంగా పందెంరాయుళ్ల కు మాత్రం గుర్తుకొచ్చేది మాత్రం కోడి పందెలు. ఈసారి సంక్రాంతి కి నెల రోజుల ముందు నుంచే గోదావరి జిల్లాల్లో కోడి పందెలు- కోతాట- గుండాటలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఈ ఏడాది ఎన్నికల సంవతర్సరం కావడంతో తమ కు అడ్డూ అదుపు ఉండదనే ధీమా లో పందెంరాయుళ్లు ఉన్నారు. గతం లో పందెం కోళ్ల పెంపకం ఎక్కడో జరిగేవి. కానీ ఈ సారి బరుల వద్దే పెంచుతూ ఏ క్షణమైనా పందాల నిర్వహణకు సిద్ధమంటున్నారు. ఉదాహరణకు తణుకు నియోజకవర్గాన్నే తీసుకుంటే గతేడాది ఇరగవరం మండలంలో ఎనిమిది బరులు- అత్తిలి మండలంలో ఆరు బరులు, తణుకు పట్టణం- రూరల్ మండలంలో 20 బరుల్లో పందాలు జరిగినట్లు పోలీసుల నివేదికలో వెల్లడించారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

గతంలో కోడి పుంజులను ఇళ్ల వద్ద- చేల గట్ల వద్ద పెంచేవారు. ఇప్పడు బరులు జరిగే ప్రాంతంలో పుంజులకు శిక్షణ ఇస్తున్నారు. గిరాకీ ని బట్టి ప్రత్యేక ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సర కాలంగా ఖరీదైన ఆహారంతో పాటు ఈత- ఇతర వ్యాయమాలు నేర్పిస్తున్నారు. రాగులు- జొన్నలు- ఇతర ధాన్యాలతో పాటు జీడిపప్పు- బాదం- మటన్ కీమా పెట్టి పందాలకు సిద్ధం చేస్తున్నారు.

కోడి పందాలతోనే మూడు రోజుల బరుల నిర్వహాణ గిట్టుబాటు కాదని- గుండాట- కోతాట వంటి వాటి ద్వారా ఆదాయం పొందాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. గతంలో ఒక్కో బరి నిర్వహాకుడు లక్ష నుంచి 10లఓల వరకూ ఆర్జించినట్లు సమాచారం. కోడిపందాల వద్దనే గుండాట- పేకాట వంటి ఏర్పాటు చేసుకునే పనిలో బరుల నిర్వాహకులు ఉన్నారు. కోడి పందాలను చూసేందుకు రాజకీయ- సినీ ప్రముఖులు వస్తుండంతో అధికారులు ఏమి చేయలేక పోతున్నారు. సంప్రదాయ ముసుగు లో కొందరి పోలీసులకు సొమ్ము ముడుతుండటంతో పోలీస్- రెవిన్యూ అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యహరిస్తున్నారు.


Tags:    

Similar News