పాన్ ఇండియా ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ..!

Update: 2021-04-25 02:30 GMT
పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందనుంది.
 
అయితే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాని కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకోసమే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కి ఎక్కువ సమయం పడుతొందని సమాచారం. 'బాహుబలి' సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్.. నాగ అశ్విన్ తో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేయనున్నాడు. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఆదిపురుష్' 'సలార్' సినిమాల షూటింగ్స్ పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎక్కువ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News