ఫొటోటాక్‌ : హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయిన పాన్‌ ఇండియా యాక్షన్‌ స్టార్‌

Update: 2020-10-16 04:15 GMT
కొన్ని రోజుల క్రితం కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ బెంగళూరులో కేజీఎఫ 2 సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. హైదరాబాద్‌ లో షూటింగ్‌ కు రెడీ అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. కేజీఎఫ్‌ 2 కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల హైదరాబాద్‌ కు వచ్చాడు. షూటింగ్‌ ఏర్పాట్లలో ఉన్నాడు. నిన్న కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ కూడా హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యాడు. ఆయన స్టైలిష్‌ లుక్‌ లో మాస్క్‌ పెట్టుకుని నల్ల పెద్ద కళ్లద్దాలతో గుర్తు పట్టని విధంగా ఉన్నా కూడా అభిమానులు మరియు అక్కడున్న వారు యశ్‌ ను గుర్తు పట్టారు.

కేజీఎఫ్‌ తో యశ్‌ కు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పాన్‌ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన యశ్‌ ప్రస్తుతం చేస్తున్న కేజీఎఫ్‌ 2 తో తన క్రేజ్‌ ను మరింతగా పెంచుకోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం సౌత్‌ నుండి ఉత్తరాధిన అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ గా ప్రభాస్‌ ఉన్నాడు. కేజీఎఫ్‌ 2 తర్వాత ప్రభాస్‌ స్థాయి క్రేజ్‌ ను స్టార్‌ డంను ఉత్తరాదిన యశ్‌ కూడా దక్కించుకుంటాడనే నమ్మకంను ఆయన అభిమానులు మరియు కన్నడ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ లో కేజీఎఫ్‌ 2 ఎన్నాళ్లు ఉంటుంది.. యశ్‌ ఇక్కడ ఎవరిని కలవబోతున్నాడు అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.
Tags:    

Similar News