వారిని పశువులతో పోల్చిన కొరటాల శివ
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వం ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా కూడా కొందరు ఇంకా కనీసం జాగ్రత్తలు పాటించకుండా సామాజిక దూరం పాటించకపోవడం కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం చేయడం లేదు. ఈ కారణంగానే ఇండియాలో కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 12 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు స్వచ్చందంగా ముందుకు వచ్చి మాస్క్ ను ధరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియాలో ఈ విషయమై చాలా సీరియస్ గా స్పందించాడు. మాస్క్ పెట్టుకోని వారిని పశువులతో పోల్చి మరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో... ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం అంటూ ట్వీట్ చేశాడు.
ఆచార్య చిత్రం షూటింగ్ కరోనా కారణంగా మద్యలో ఆగిపోవడంతో కొరటాల అసహనంతో ఉన్నారు. కాస్త అయినా కరోనా ప్రభావం తగ్గితే షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటే కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాని తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆ కారణంగానే మాస్క్ విషయంలో అవగాహణ పెంచేందుకు కొరటాల ఇలా ఘాటుగా ట్వీట్ చేసి ఉంటాడు.