ఆ సినిమాను పాతికేళ్లు తీశారు.
బాహుబలి తెలుసు.. కంచె తెలుసు.. భజరంగి భాయ్ జాన్ తెలుసు.. చివరకు దురంతో సినిమా కూడా తెలుసు.. కానీ... పహాడోరొ లుహా అన్న సినిమా పేరు విన్నారా? దానికి కూడా వీటన్నిటితో పాటే జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా నేపథ్యం.. పాతికేళ్ల పాటు సాగిన దాని నిర్మాణం అన్నీ ఆసక్తికరమే.
రెండు రోజుల కిందట జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘బాహుబలి’ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు రావడంతో ఎవరి నోట విన్నా అదే మాట. బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ఎంతగా ప్రాచుర్యం దక్కిందో ఇప్పుడు అవార్డు వచ్చినప్పుడూ మళ్లీ అంతగా జనం నోళ్లలో నానింది. అదే సమయంలో ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో ఉత్తమ తెలుగు చిత్రంగా కంచె అవార్డుకు ఎంపికవగా ఆ భిన్నమైన కథనానికీ ప్రశంసలు దక్కాయి. అయితే... అదే సమయంలో మన పొరుగునే... ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కొండల్లోని ఆదివాసీల కష్టాలపై తీసిన ఒడియా సినిమా ‘‘పహాడొర లుహా’’ కూడా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డుకు ఎంపికైందని ఎంతమందికి తెలుసు? అంతేకాదు.... ఆ సినిమాను పాతికేళ్ల పాటు నిర్మించారన్న సంగతి ఎంత మందికి తెలుసు? అన్నిటికీ మించి పరిశ్రమల పేరుతో జరుగుతున్న విధ్వంసం వల్ల అమాయక ఆదివాసీలు పడుతున్న కష్టాలకు చిత్రరూపం ఆ సినిమా అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలిసినా తెలియకున్నా నియమగిరుల నుంచి నీలగిరుల వరకు అఖండ తూర్పు కనుమల్లో జరుగుతున్న పారిశ్రామికీకరణ ప్రభావంపై తీసిన ఓ సినిమాకు అవార్డు దక్కడం గొప్ప విషయమే. అన్నిటికీ మించి సోకాల్డ్ సినిమాల్లా కాకుండా అనుకున్న కథ కోసం పాతికేళ్లు శ్రమించి సినిమా తీయడం సాధారణ విషయమూ కాదు. ఆ ఘనత దర్శక నిర్మాత సవ్యాసాచి మహాపాత్రొదే. సవ్యసాచి నిజంగానే సవ్యసాచి అని చెప్పాలి. కథా రచన, కథన సారథ్యం, దర్శకత్వం, నిర్మాణం అన్నింటిలో ఆయన మేటి. గత ఏడాది నేషనల్ ఫిల్ము అవార్డుల్లోనూ ఆయన సినిమా ‘ఆదిమ్ విచార్’(ప్రాచీన న్యాయం) అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు పహాడోరో లుహా అవార్డు గెలుచుకుంది. పాతికేళ్లకు పైగా తన సినీ జీవితంలో ఆయన తీసిన సినిమాలు కేవలం తొమ్మిదే అంటే ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారో తెలుస్తుంది.
పహాడోరొ లుహా సినిమాకు అవార్డు రావడంతో సవ్యసాచి పాతికేళ్ల కలకు న్యాయం జరిగిందనే చెప్పాలి. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని కొండల్లో నివసించే గిరిజనుల జీవన విధానాలపై మోడర్నైజేషన్ ప్రభావాన్ని ఈ సినిమాలో చూపించారు. కొండలను నమ్మకుని బతికే గిరిజనులు అక్కడ జరుగుతున్న పారిశ్రామికీకరణ వల్ల ఎన్నికష్టాలు పడుతున్నార్ చెప్పారు. కొండలను తల్లిలా... గిరిజనులను పిల్లల్లా పేర్కొంటూ తమ పిల్లలు పడుతున్న కష్టాలను చూసి కొండలు కన్నీరు పెడుతున్నాయని ‘‘పహాడోరొ లుహా’’(కొండల కన్నీరు) ఆయన తన సినిమా ద్వారా ప్రపంచానికి చాటారు. మోడర్నైజేషన్ వల్ల గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, వారి జీవన శైలి అన్నీ ఎలా దెబ్బతింటున్నాయన్నది ఆయన తన సినిమాలో చూపించారు.
పాతికేళ్ల కిందట నిర్మాణం మొదలైంది..
ఈ సినిమా నిర్మాణం పాతికేళ్ల కిందట మొదలవడం విశేషం. ఆయన మస్తిష్కంలో పుట్టిన ఈ కథాంశాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడానికి ఆయన పాతికేళ్ల పాటు వెయిట్ చేసి రెండున్నర దశాబ్దాల్లో జరిగిన పరిణామాలను ఆవిష్కరించారు. పాతికేళ్ల కిందట ఆయన చూసిన గ్రామాలు ఇప్పుడు అక్కడ లేవు. బాణాలు, విల్లులు వాడిన గిరిజనులు ఇప్పుడు వేటకోసం తుపాకులు వాడుతున్నారు. గిరిజనులు నక్సలిజం వైపు అడుగులు వేయడానికి గల కారణాలను, పరిష్కార మార్గాలనూ కూడా ఆయన ఇందులో చెప్పారు. సౌమెన్ పూజారి, స్వాతి రే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నిజంగా ఒక కళా ఖండమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పహాడోరొ లుహాకు అవార్డు రావడం అన్నది సినిమా పరిశ్రమలో ఉన్న సత్తాకు దక్కిన గౌరవం.... సినిమా అంటే వినోదమే కాదు సామాజిక సమస్యలపై పోరాటం అని కూడా చెప్పినట్లయింది.
అన్నీ అవార్డు సినిమాలే...
సవ్యాసాచిమహాపాత్రొ తీసిన సినిమాలన్నీ మణిపూసలే. 2014లో రిలీజైన ఆదిమ విచార్ కు 2015లో నేషనల్ అవార్డు వచ్చింది. 2012లో వచ్చిన సాలా బుఢాకు ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్ము ఫెస్టివల్ లో స్థానం లభించింది. ఇప్పడు పహాడొరొ లుహాకు మళ్ల జాతీయ అవార్డు వచ్చింది.