బిగ్ బాస్ లో ప్రేమ.. నా వల్ల కాదింక

Update: 2017-08-07 11:33 GMT
రీసెంట్ గా తమిళ్, తెలుగులో స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట తమిళ్ లో బిగ్ బాస్ షో అంతగా ఆధారణ పొందలేకపోయింది. కానీ రాను రాను ఈ షో పై వస్తున్న విమర్శలే మంచి పాపులారిటీని తెచ్చి పెట్టాయి. దీంతో ప్రస్తుతం తమిళ జనాలు ఆ రియాలిటీ షోకి దాసోహం అయిపోతున్నారు.

అయితే రీసెంట్ గా ఈ షోలో నుండి ఓ నటి అనుకోకుండా తప్పుకోవడంతో తమిళ అభిమానులను చాలా నిరాశకు గురిచేసిందట. మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన "ఓవియా హెలెన్" బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే మొదటి వారం వరకు బాగానే అలరించిన ఈ ముద్దుగుమ్మ షోలో ఇక ఉండలేనని తెగేసి చెప్పేసింది. వివరించింది. బిగ్ బాస్ షోలో ఒకరిని మించి ఒకరు పోటీ పడి ఎలాగైనా ఎలిమినేటి కాకూడదని చూస్తారు. ఈ తరుణంలో ఒక్కోసారి పార్టిసిపేట్స్ మధ్య గొడవలు జరగడం, ఆవేశానికి లోనవ్వడం వంటి పరిణామాలను తాను ఎదుర్కోలేనని ఓవియా చెబుతూ.. మరో విషయాన్నీ బయటపెట్టింది. ఈ షోలో మరో పార్టిసిపేట్ గా ఉన్న ఆరవ్ పై ఆమె ఇష్టాన్ని పెంచుకుందట. అంతే కాకుండా అతనిపై ఉన్న ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని చేబుతూ.. అందుకే ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు సమాధానాన్ని ఇచ్చింది.

ఇప్పటివరకు ఉన్న పార్టిసిపెంట్స్ లో ఒవియానే చాలావరకు ఆకట్టుకుంది. ఇచ్చిన ప్రతి టాస్క్ లలో ఎంతగానో అలరిస్తూ తోటి వారికి ధీటుగా సమాధానం చెప్పింది. కానీ సడన్ గా ఆమె నిష్క్రమించడంతో చాలా మంది తమిళ అభిమానులు నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.  


Tags:    

Similar News